Advertisement

చీరాలలో లారీ యజమానుల నిరసన

Jun 30 2020 @ 05:43AM

చీరాల, జూన్‌ 29 : వరుసగా డీజల్‌ ధరలు పెంచటంపై చీరాల లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కార్యాలయం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. డీజిల్‌ ధరల పెంపుతో తమపై భారం పెరిగిందని, వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


పెంచిన పెట్రోలు, డీజల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి దేవరపల్లి రంగారావు డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో రంగారావు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రో ధరలు పెంచడం దారుణమన్నారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మేళం ప్రతా్‌పకుమార్‌, కంకట అనిల్‌, మహ్మద్‌ఆలీ పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.