లారీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ

ABN , First Publish Date - 2022-07-06T06:06:57+05:30 IST

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని విజయవాడ-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

లారీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ
రోడ్డుకు అడ్డంగా పడిన లారీ

 బస్సు క్లీనర్‌ మృతి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

 ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

నార్కట్‌పల్లి, జూలై 5: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని విజయవాడ-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి శివారు ఫ్లైఓవర్‌పై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు(ఏపీ16టీజే-6961) బెంగళూరు నుంచి 30మంది ప్రయాణికులతో ఖమ్మంకు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో నార్కట్‌పల్లిలోని నల్లగొండ ఫ్లైఓవర్‌ వద్దకు చేరు కోగానే ముందు వెళ్తున్న కంటైనర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన కంటైనర్‌ లారీ ఫ్లైఓవర్‌పై రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసంకాగా, డ్రైవర్‌ మంజునాథ్‌, క్లీనర్‌ సాల్మన్‌రాజులకు తీవ్రంగా, ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అం దిన వెంటనే ఎస్‌ఐ తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108అంబులెన్స్‌లో స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గా యపడిన నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌కు చెందిన బస్సు క్లినర్‌ సాల్మన్‌ రాజు(23) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సాయంత్రం మృతిచెందాడు. డ్రైవర్‌ మంజునాథ్‌కు ప్రాణా పాయం తప్పింది. స్వల్పంగా గాయపడిన ప్రయా ణికులకు ప్రథమ చికిత్స అనంతరం పంపించారు. రోడ్డుకు అడ్డంగా పడిన కంటైనర్‌, బస్సును ఎక్స్‌కవేటర్‌ సాయంతో పక్కకు తప్పించి రోడ్‌ను క్లియర్‌ చేశామని ఎస్‌ఐ తెలిపారు. జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదు.

Updated Date - 2022-07-06T06:06:57+05:30 IST