దూదిపూలు.. దళారుల పాలు

ABN , First Publish Date - 2020-11-30T05:03:58+05:30 IST

ఇప్పటికే ప్రకృతి ఆగ్రహానికి గురై తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ప్రస్తుతం దళా రులు నిండా ముంచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లాలో మొదటి దశ పత్తి ఏరిన రైతులు అమ్మకం కోసం ఎ దురుచూస్తున్నారు. ప్రభుత్వం నేటికీ అనుకున్నమేర సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు సొమ్ముచేసుకునే పనిలో పడ్డారు. పత్తి రంగు మారిందని, తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకులు చూపుతూ క్విం టాలుకు రూ.3,400 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే చె ల్లిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారు.

దూదిపూలు.. దళారుల పాలు
ఇటీవల బీబీపేట మండలంలో పత్తికొనుగోలులో మోసం చేసిన వారిని పట్టుకున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో నిండా మునుగుతున్న పత్తి రైతు

సీసీఐ కేంద్రాల ఏర్పాటులో సర్కారు తీవ్ర జాప్యం

గ్రామాల్లో దందా షురూ చేసిన దళారులు

ఇప్పటికే తొలిదశ పత్తిని అమ్ముకున్న రైతులు

అకాల వర్షాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈసారి అన్నదాతలకు తప్పని నష్టాలు

కామారెడ్డి, నవంబరు 29: ఇప్పటికే ప్రకృతి ఆగ్రహానికి గురై తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ప్రస్తుతం దళా రులు నిండా ముంచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లాలో మొదటి దశ పత్తి ఏరిన రైతులు అమ్మకం కోసం ఎ దురుచూస్తున్నారు. ప్రభుత్వం నేటికీ అనుకున్నమేర సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు సొమ్ముచేసుకునే పనిలో పడ్డారు. పత్తి రంగు మారిందని, తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకులు చూపుతూ క్విం టాలుకు రూ.3,400 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే చె ల్లిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారు. దీనికి తోడు తూకంలో నూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కామారెడ్డి జి ల్లాలోని బీబీపేట మండలంలో వరంగల్‌కు చెందిన దళారు లు రైతుల వద్ద పత్తి కొనుగోలు చేపట్టి.. తూకంలో మోసం చేయడంతో గుర్తించిన రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల దృ ష్టికి తీసుకుపోగా.. వారిపై కేసులు సైతం నమోదు చేయిం చారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి మద్దతు ధర రాక రైతులకు అప్పులే మిగిలేలా ఉన్నాయి.

జాడలేని కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం పత్తిపంటను రైతులు గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. అయితే, పంట కాత దశకు వచ్చిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసి పత్తి రైతులను దెబ్బ తిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎక రాలకుపైగా పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దిగుబడికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించి.. క్వింటాలకు రూ.5,825 నుంచి రూ5,725 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయిస్తా మని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు కొన్నిచోట్ల మా త్రమే కేంద్రాలను ఏర్పాటుచేసి మమ అనిపించేసిందని ప త్తి రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితులలో కూలీలకు చె ల్లించాల్సిన డబ్బులు, ఇతర అవసరాలకు రైతులు పత్తిని గ్రామాల్లోనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే, రైతు ల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు మరింత ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

సిండికేటైన వ్యాపారులు

ప్రభుత్వం డిమాండ్‌ ఉన్నచోట సకాలంలో సీసీఐ కేంద్రా లు ప్రారంభించకపోవడం దళారులకు కలిసి వచ్చింది. గ్రా మాల్లో పలువురు ఫర్టిలైజర్‌ యజమానులు, వడ్డీ వ్యాపారు లు, ప్రజాప్రతినిధులు పత్తివ్యాపారుల అవతారం ఎత్తారు. ఏజెంట్లను నియమించుకుని ఇతర జిల్లాలలో తమకు పరి చయం ఉన్న వారితో ఆయా ప్రాంతాలలో కొనుగోలు చేప ట్టేలా చూస్తూ పత్తిని రైతులు గ్రామాల్లోనే విక్రయించే విధ ంగా పావులు కదుపుతున్నారని సమాచారం. సిండికేట్‌గా ఏర్పడి తమ వ్యాపారాన్ని మూడు పూవులు.. ఆరు కాయ లుగా కొనసాగిస్తున్నారు. తమకు రవాణా ఖర్చులు తప్ప డంతో పాటు అక్కడిక్కడే డబ్బులు చెల్లిస్తారనే ఉద్దేశంతో రైతులు కూడా వారికే పత్తిని విక్రయించడానికి సుముఖత చూపుతున్నారు. దీంతో దళారులు రైతులను మద్దతు ధర లో రూ.2వేల వరకు ముంచుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొట్లాది రూపాయలు నష్టపోయారు.

తూకంలోనూ మోసం

పత్తిని తూకం వేసేటప్పుడు ఎలకా్ట్రనిక్‌ కాంటాలను విని యోగించాలనే నిబంధన ఉన్నా.. గ్రామాల్లో ఎక్కడా అవి క నిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దళారు లు పాతరకం కాంటాలను వినియోగిస్తున్నారు. పాత రకం బాట్లు వాడడంతో క్వింటాలుపై సుమారు 15 కిలోల పత్తిని అదనంగా తూకం వేస్తున్నారని సమాచారం. దీంతో రైతు లు మరింతగా నష్టపోవాల్సి వస్తోంది.

Updated Date - 2020-11-30T05:03:58+05:30 IST