ట్విట్టర్ కొనుగోలు... పెట్టుబడిదారుల్లో భిన్న అంచనాలు

ABN , First Publish Date - 2022-04-29T00:45:50+05:30 IST

ట్విట్టర్ ఇంక్ ప్రతిపాదిత $44 బిలియన్ల కొనుగోలు ప్రక్రియను ఎలోన్ మస్క్ పూర్తి చేస్తారా ? లేదా ? అన్న విషయమై పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారుర.

ట్విట్టర్ కొనుగోలు...   పెట్టుబడిదారుల్లో భిన్న అంచనాలు

క్యాలిఫోర్నియా : ట్విట్టర్ ఇంక్ ప్రతిపాదిత $44 బిలియన్ల కొనుగోలు ప్రక్రియను ఎలోన్ మస్క్ పూర్తి చేస్తారా ? లేదా ? అన్న విషయమై పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారుర. మస్క్ తన $ 21 బిలియన్ల నగదు సహకారానికి నిధులు సమకూర్చుకునేందుకు తగినంత డబ్బుని కలిగి ఉండకపోవచ్చనన్న ఆందోళనను వ్యాపారులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో... మస్క్... ట్విట్టర్ బోర్డులో ప్రవేశించరాదంటూ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ళ క్రితం... 2018 లో, టెస్లాను ప్రైవేట్‌గా తీసుకోవడానికి సంబంధించి... ‘$ 72 బిలియన్ల ఒప్పందానికి... ఫండింగ్ సురక్షితం’ అంటూ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 


ఇదిలా ఉంటే... మస్క్ ట్విట్టర్ ఒప్పందంలో $21 బిలియన్ల ఈక్విటీ చెక్ కోసం టెస్లాలో వాటాలను విక్రయించాల్సి ఉంటుంది. 

మస్క్ తన ఈక్విటీ ఫైనాన్సింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను అందించడం ద్వారా, లేదా... చెక్‌ను విభజించడంలో సహాయపడటానికి భాగస్వాములను తీసుకురావడం ద్వారా కొన్ని మార్కెట్ గందరగోళాలను శాంతపరచవచ్చునన్న వ్యాఖ్యానాలు మార్కెట్ వర్గాల నుంచి ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా... ఇది ఈ భాగస్వాముల గుర్తింపు ఆధారంగా డీల్‌కు కొత్త రిస్క్‌లను దారితీయవచ్చని కొందరు ఫండ్ మేనేజర్లు పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2022-04-29T00:45:50+05:30 IST