తామర గింజల ఖీర్‌

ABN , First Publish Date - 2020-12-05T19:08:32+05:30 IST

తామరగింజలు - పావుకేజీ, పాలు - ఒక లీటరు, పంచదార - 25గ్రా, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - పది, యాలకులు - నాలుగు.

తామర గింజల ఖీర్‌

కావలసినవి: తామరగింజలు - పావుకేజీ, పాలు - ఒక లీటరు, పంచదార - 25గ్రా, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - పది, యాలకులు - నాలుగు.


తయారీ విధానం: ఒక మందపాటి పాత్ర తీసుకుని స్టవ్‌పై పెట్టి వెన్న వేసి తామరగింజలను వేగించాలి. తరువాత వాటిని గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేయాలి. ఇప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న తామరగింజలు వేసి కలపాలి. మరికాసేపు ఉడికిన తరువాత యాలకుల పొడి వేయాలి. బాదంపలుకులతో గార్నిష్‌ చేసి అందించాలి.


తామరగింజలలో...

ప్రోటీన్లు - 9.7 గ్రా

క్యాలరీలు - 347

ఫైబర్‌ - 14.5 గ్రా


Updated Date - 2020-12-05T19:08:32+05:30 IST