జోరుగా తాటి ముంజెల విక్రయాలు

ABN , First Publish Date - 2021-04-24T05:07:01+05:30 IST

వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజెలు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే శీతల పానీయాల కన్నా తాటి ముంజెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం చెబుతున్నారు.

జోరుగా తాటి ముంజెల విక్రయాలు
తాటి ముంజెలను ఒలుస్తున్న దృశ్యం

లంకెలపాలెం, ఏప్రిల్‌ 23: వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజెలు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే శీతల పానీయాల కన్నా తాటి ముంజెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం చెబుతున్నారు. దీంతో వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా విజయనగరం, బొబ్బిలి, ఎల్‌ కోట, పార్వతీపురం మండలాల నుంచి కళ్లు గీత కార్మికులు కుటుంబాలతో సహా వేసవి సీజన్‌లో ఇక్కడికి వలస వస్తుంటారు. లంకెలపాలెం,  అగనంపూడి ప్రాంతాల్లో జాతీయ రహదారి ఇరుపైపులా దుకాణాలను ఏర్పాటు చేసి తాటి ముంజెలను విక్రయిన్నారు. సబ్బవరం పరవాడ మండలాల్లో చెట్ల నుంచి సేకరించిన తాటి ముంజెలను ఆటోల్లో ఇక్కడికి తరలిస్తున్నారు. వాటిని ఒలిచి డజను ముంజెలు రూ.20 నుంచి రూ.25కు విక్రయిస్తున్నారు. వీటి విక్రయాల వల్ల ఖర్చులు పోనూ రూ.500 వరకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-24T05:07:01+05:30 IST