అమెరికాలో కనీవినీ ఎరుగని ఘటన.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు!

ABN , First Publish Date - 2021-03-21T00:33:35+05:30 IST

ఇంత వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని ఓ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా

అమెరికాలో కనీవినీ ఎరుగని ఘటన.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు!

వాషింగ్టన్: ఇంత వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని ఓ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటాలీ నాక్విన్ హార్వే అనే యువతి  లూసియాన రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో.. అధికారులు గత ఏడాది రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్డును ప్రొక్లైన్‌లతో తొవ్వించి.. కొన్ని రోజులపాటు హడావిడి చేశారు. ఈ క్రమంలో కొంత మేరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే నటాలీ నాక్విన్ హర్వే ఇంటి ముందు మాత్రం రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీనికి ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. నిర్మాణ పనులను మొదలుపెట్టి ఏడాది గడుస్తున్న సందర్భంగా రోడ్డు నిర్మాణ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. బెలూన్లు, కేక్‌తో ప్రొక్లెయిన్ ముందు నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మా రోడ్డు నిర్మాణానికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.


Updated Date - 2021-03-21T00:33:35+05:30 IST