ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

ABN , First Publish Date - 2021-06-15T18:02:15+05:30 IST

ప్రేమించిన యువతితో త్వరగా వివాహం చేయాలంటూ ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన తెలిపాడు. అందిన సమాచారం మేరకు.. విజయ నగర జిల్లాలోని మరెంనళ్లిలోని ఆరో వార్డుకు చెందిన చిరంజీవి కొ

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు


కంప్లి(కర్ణాటక): ప్రేమించిన యువతితో త్వరగా వివాహం చేయాలంటూ ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన తెలిపాడు. అందిన సమాచారం మేరకు.. విజయ నగర జిల్లాలోని మరెంనళ్లిలోని ఆరో వార్డుకు చెందిన చిరంజీవి కొన్ని రోజులుగా ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న పెద్దలు కూడా వీరిద్దరి వివాహానికి అంగీకరించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ ఉండటంతో వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో సోమవారం మద్యం తాగిన చిరంజీవి వీరభద్రేశ్వర ట్యాకీస్‌ వద్ద వున్న సెల్‌ టవర్‌పైకి ఎక్కాడు. తమకు వివాహం చేస్తారా లేకపోతే టవర్‌పై నుంచి దూకాలా అంటూ కేకలు వేశాడు. వెంట నే సీఐ వసంత్‌ వివసూద, ఎస్‌ఐ మీనాక్షి, పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని వారి త్వరలో వివాహం జరిపిస్తామని నచ్చజెప్పడంతో మద్యం మత్తులో వున్న చిరంజీవి టవర్‌ దిగి కిందకు వచ్చాడు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-06-15T18:02:15+05:30 IST