సరిగ్గా 14 రోజుల క్రితం ప్రేమ పెళ్లి.. పనికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో షాకింగ్ సీన్...

Sep 26 2021 @ 13:49PM

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. రెండువారాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఈ ఘటన సరాయ్‌కెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దోలాండీలో చోటుచేసుకుంది. భర్త ఇంటికి రాగానే భార్య మృతదేహం ఇంటిలో కనిపించేసరికి ఈ విషయాన్ని చుట్టుపక్కలవారికి తెలియజేశాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతురాలిని కెరయి(20)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్త ముఖేష్ పనికోసం ఇంటి నుంచి బయటకువెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య ఇంటిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని గ్రామపెద్ద వీరేంద్రకు తెలియజేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.