Love Story: శేఖర్‌ కమ్ముల స్టైల్‌ సినిమా

Sep 17 2021 @ 19:36PM

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు.

నారాయణదాస్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘‘ ఎంతోకాలంగా డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌లో ఉన్నప్పటికీ నిర్మాణం గురించి ఆలోచించలేదు. సినిమా నిర్మాణం పట్ల ఎన్నో విషయాలు నేర్చుకుని ఈ రంగంలో అడుగుపెట్టాం. ఇప్పుడు మాకు ఇది కొత్త అనుభవం. ‘లవ్‌స్టోరి’ గతేడాది విడుదల కావాల్సిన సినిమా. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు థియేటర్‌లలో సినిమాను విడుదల చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాం. మంచి ఎమోషన్స్‌ ఉన్న ఫీల్‌గుడ్‌ సినిమా ఇది. ఇలాంటి చిత్రాన్ని థియేటర్‌లోనే ఎంజాయ్‌ చేయగలం. అందుకే ఓటీటీలు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా థియేటర్‌లోనే విడుదల చేయాలనుకున్నాం’’ అని అన్నారు. 


మరో నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ‘‘నారాయణదాస్‌ నారంగ్‌ 100కు పైగా థియేటర్స్‌, 10 మల్టీప్లెక్సులను నడుపుతున్నారు. నాకు డిస్ట్రిబ్యూషన్‌ మీద పట్టుంది. ఆ అనుభవంతోనే కొన్నేళ్ల క్రితం నిర్మాతగా మారాను. నారాయణదాస్‌ నారంగ్‌ గారితో మొదటి చిత్రమిది. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నాం. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌గారి ‘వకీల్‌ సాబ్‌’ రిలీజ్‌ అయింది. దాంతో మా సినిమా వాయిదా వేశాం. ఆ తర్వాత మళ్లీ థియేటర్లు మూతపడడంతో విడుదల ఆగింది. ఇక కథ విషయానికొస్తే రేవంత్‌, మౌనికల ప్రేమను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. పక్కా శేఖర్‌ కమ్ముల స్టైల్‌ సినిమా ఇది. అందరినీ అలరించే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఏపీలో థియేటర్‌ టికెట్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్థంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ని కలవబోతున్నాం’’అని ఆయన అన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.