నిర్మానుష్య ప్రాంతంలో కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమజంట.. సడన్‌గా కొందరు యువకుల ఎంట్రీ.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-17T19:39:23+05:30 IST

ఆ ప్రేమికులిద్దరూ బైక్‌పై ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు.. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..

నిర్మానుష్య ప్రాంతంలో కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమజంట.. సడన్‌గా కొందరు యువకుల ఎంట్రీ.. చివరకు..

ఆ ప్రేమికులిద్దరూ బైక్‌పై ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు.. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఆ సమయంలో కొందరు గ్రామస్థులు వారిని చూశారు.. వారిద్దరినీ పట్టుకుని దాడికి దిగారు.. కులం పేరు, ఊరి పేరు, ఆధార్ కార్డులు అడిగారు.. ప్రేమికులు వాటిని ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరినీ కొట్టారు.. తమను వదిలేయమని ఆ యువతి చేతులు జోడించి ఏడుస్తూ వేడుకున్నా వారు వినలేదు.. ఆ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీహార్‌లోని గయ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


గయకు సమీపంలోని ఓ గ్రామ శివారులో ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిని చూసిన గ్రామస్థులు వారిపై దాడికి తెగబడ్డారు. ఏ కులం అని అడిగి వారిని కొట్టారు. ఆధార్ కార్డులు చూపించాలని అడిగారు. ఆ ప్రేమికులు తమను క్షమించి వదిలేయమని వేడుకున్నా ఆ గ్రామస్థులు కనికరం చూపించలేదు. ఇద్దరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అక్కడే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ఆ యువతి ఏడవడం ప్రారంభించింది. 


తనను వదిలెెయ్యాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఆ యువతి బెదిరించింది. అయినా గ్రామస్థులు ఆ ఇద్దరి ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ వైరల్ వీడియోపై స్థానిక పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఆ వీడియో నిజమైనదో, కాదో నిర్ధారించుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Updated Date - 2022-05-17T19:39:23+05:30 IST