వరసకు అన్నాచెల్లెళ్లు.. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. విషయం తెలిసి పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. చివరకు..

Sep 20 2021 @ 21:44PM

ఇంటర్నెట్ డెస్క్: గణేశ్ నిమజ్జనంలో ఆ యువతీయువకుల జంట చాలా ఉత్సాహంగా.. స్నేహితులు, బంధువులతో కలిసి నృత్యాలు చేశారు. కానీ.. ఆ రోజు రాత్రి మాత్రం ఆ ఇద్దరూ ఇళ్లకు వెళ్లలేదు. తెల్లారేసరికల్లా పొలంలోని ఓ బావి వద్ద ఉరిపోసుకుని ప్రాణాలు వదిలారు. అంతకుముందు రోజే ఆనందంగా కనిపించిన వారు మరుసటి రోజుకల్లా ఇలా నిర్జీవంగా మారడంతో స్థానికంగా కలకలం రేగింది. రాజస్థాన్‌లో పాలీ జిల్లాల్లో శనివారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


అయితే..పోలీసు విచారణ సందర్భంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ ఇద్దరు ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల వారి ఇద్దరి గోత్రాలు ఒకటే అని బయటపడింది. ఫలితంగా వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లయ్యారు. దీంతో ఇరు కుటుంబాలు వారి వివాహానికి నిరాకరించాయి. ఈ విషయం తెలియగానే యువతీయువకులు ఇద్దరూ తీవ్రనిరాశలో కూరుకుపోయారు. తమకు ఇక జీవితాంతం మనశ్శాంతి దొరకదనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే వారు అనూహ్యంగా ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని తాము అస్సలు ఊహించలేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. స్థానిక పోలీసులు యువతీ యువకుల మృతదేహాలను జిల్లా ప్రధానాస్పత్రికి తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.