అవర్‌ ఫుడ్‌ రూ.45 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2022-01-26T06:56:53+05:30 IST

అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌.. ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌, సీ4డీ ఏషియా ఫండ్‌ నుంచి రూ.45 కోట్ల నిధు లు (60 లక్షల డాలర్లు) సమీకరించినట్లు వెల్లడించింది..

అవర్‌ ఫుడ్‌  రూ.45 కోట్ల సమీకరణ


హైదరాబాద్‌ : అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌.. ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌, సీ4డీ ఏషియా ఫండ్‌ నుంచి రూ.45 కోట్ల నిధు లు (60 లక్షల డాలర్లు) సమీకరించినట్లు వెల్లడించింది. ఇన్నోవేటివ్‌, డీసెంట్రలైజ్డ్‌ మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను అవర్‌ ఫుడ్‌ నిర్వహిస్తోంది. కార్యకలాపాల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఆహారోత్పత్తుల సప్లయ్‌ చెయిన్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు అవ ర్‌ ఫుడ్‌ సీఈఓ బాలా రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

Updated Date - 2022-01-26T06:56:53+05:30 IST