
ఒక వివాహిత తన భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడికి ఇంటికి పిలిచేది. ఇలా తరుచూ జరుగుతున్న తరుణంలో ఒకరోజు ఆ ప్రియుడు ఆ ఇంట్లో నిద్రపోయాడు. ఎంతసేపటికీ లేవకపోవడంతో ఆమె అతడిని గమనించగా.. ఆ ప్రియుడు మరణించాడు. ఏం చేయాలో తోచక ఆమె పోలీసుల వద్దకు వెళ్లి తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో నిద్రపోతూ చనిపోయాడని చెప్పింది. కానీ పోలీసుల విచారణలో మరో కోణం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్న జిల్లా మహురఛ్ గ్రామంలో నివసించే శాలిని(28) అనే యువతి వివాహం తరువాత యువరాజ్(40) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శాలిని భర్త, యువరాజ్ ఇద్దరూ లారీ డ్రైవర్లు. ఆమె భర్త పనిమీద వేరే ఊరు వెళ్లినప్పుడు యువరాజ్ ఎక్కువగా శాలిని ఇంటికి వచ్చేవాడు. అలా ఒకరోజు శాలిని ఇంటికి యువరాజ్ వెళ్లినప్పుడు.. అతను భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు. ఆ తరువాత లేవలేదు. అతడు నిద్రలోనే చనిపోయాడని గమనించిన శాలిని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త స్నేహితుడు తన ఇంట్లో నిద్రపోతూ చనిపోయాడని చెప్పింది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
పోలీసులు యువరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ తరువాత శాలినిని ప్రశ్నించగా.. ఆమె సమాధానాలు చెప్పే సమయంలో కంగారు పడడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. మరుసటి రోజు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అందులో యువరాజ్ ఊపిరి ఆడక చనిపోయాడని ఉంది.
పోలీసులు శాలినిని అదుపులోకి తీసుకొని కఠినంగా ప్రశ్నించారు. అప్పడు శాలిని నిజం చెప్పింది. యువరాజ్ తరుచూ ఇంటికి వచ్చి తన నుంచి డబ్బు తీసుకొనే వాడని.. బలవంతంగా శృంగారం చేసేవాడని చెప్పింది. అతడిని వదిలించుకోవలానే ప్లాన్ వేసి.. అతడు నిద్రపోతున్నసమయంలో ముఖంపై దిండు పెట్టి ఊపిరి అందకుండా చంపేశానని చెప్పింది.
పోలీసులు శాలినిపై యువరాజ్ హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి