అనుమానాస్పద రీతిలో పోలీసులకు పట్టుబడ్డ యువతి, యువకుడు.. వాళ్లు చెప్పింది విని కుటుంబ సభ్యులకు ఫోన్.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-06-04T22:55:09+05:30 IST

రైల్వేస్టేషన్‌లో ఓ యువతి, యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి, ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారిద్దరూ అసలు విషయం చెప్పేశారు. ఈ క్రమంలో వారిద్దరినీ

అనుమానాస్పద రీతిలో పోలీసులకు పట్టుబడ్డ యువతి, యువకుడు.. వాళ్లు చెప్పింది విని కుటుంబ సభ్యులకు ఫోన్.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: రైల్వేస్టేషన్‌లో ఓ యువతి, యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి, ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారిద్దరూ అసలు విషయం చెప్పేశారు. ఈ క్రమంలో వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అధికారుల కబురుతో స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటంటే.. 


శ్రేయారాజ్ అనే యువతి.. 2021లో ఎవరికో ఫోన్ చేయబోయి.. పాట్నాకు చెందిన అంకిత్‌కు ఫోన్ కలిపింది. కొద్ది క్షణాల్లోనే తాను చేసిన పొరపాటును గుర్తించి కాల్ కట్ చేసింది. ఈ క్రమంలోనే శ్రేయారాజ్‌కు అంకిత్ తరచూ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. తొలుతు అతడితో మాట్లాడటానికి ఇష్టపడని ఆ యువతి.. క్రమంగా అంకిత్‌తో మాట కల్పింది. చివరికి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. సంవత్సరంపాటు ప్రేమ ప్రయాణం సాగిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇంట్లో ప్రేమ విషయం చెబితే.. ఒప్పుకోరనే సందేహంతో సూరత్ పారిపోదాం అనుకున్నారు. 



ఈ నేపథ్యంలోనే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే వారి అనుమానాస్పద కదలికలను చూసి అక్కడి పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. వారి దగ్గరకు వెళ్లి, ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ప్రేమ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అయితే వారి పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు.. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి స్టేషన్‌కు రప్పించారు. అనంతరం పిల్లల ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అంకిత్, శ్రేయారాజ్ కుటుంబ సభ్యులు.. వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. యువతి, యువకుడి ఇంటికి తీసుకెళ్లి, స్థానికంగా ఉన్న గుడిలో వివాహం జరిపించారు. 


Updated Date - 2022-06-04T22:55:09+05:30 IST