ఇద్దరికీ 16 ఏళ్ల వయసు.. అర్ధరాత్రి ఊరి చివరకు.. ఫొటోలు తీసుకుని.. వీడియోను చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్.. తెల్లారేలోపు..

ABN , First Publish Date - 2022-06-29T21:24:21+05:30 IST

ఆ యువతీయువకులిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే నివసించేవారు.. ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు..

ఇద్దరికీ 16 ఏళ్ల వయసు.. అర్ధరాత్రి ఊరి చివరకు.. ఫొటోలు తీసుకుని.. వీడియోను చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్.. తెల్లారేలోపు..

ఆ యువతీయువకులిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే నివసించేవారు.. ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు.. ఇద్దరూ మంగళవారం రాత్రి 11 గంటలకు ఊరి చివరకు చేరుకున్నారు.. ఇద్దరూ కలిసి బోలెడన్ని ఫొటోలు తీసుకున్నారు.. వాటితో ఓ వీడియోను రూపొందించారు.. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. `మేమిద్దరం ప్రేమికులం.. లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం` అని కామెంట్ చేశారు. అనంతరం ఇద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

ఒకే షాపులో 12 సార్లు చోరీ చేసిన దొంగోడు.. చివరకు ఎలా దొరికిపోయాడో తెలిస్తే నవ్వాపుకోలేరు..!


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బాసర వాసి జస్రామ్ (16), సౌ (16) ఇరుగుపొరుగు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వీరి మధ్య గత కొన్ని ఏళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. మంగళవారం రాత్రి ఇద్దరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి కిలోమీటరు దూరం వెళ్లారు. అక్కడ ఇద్దరూ దాదాపు గంటసేపు గడిపారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. కొత్త ఫోటోలు, పాత ఫోటోలను కలిపి ఒక వీడియో రూపొందించారు. `ప్రేమికులమైన మేమిద్దరం లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం` అంటూ ఆ వీడియోను Facebookలో పోస్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నారు. 


బుధవారం ఉదయం గ్రామస్థులు వారి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ప్రేమికులిద్దరూ ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-06-29T21:24:21+05:30 IST