రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం

ABN , First Publish Date - 2022-02-18T19:15:12+05:30 IST

రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం

రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 8.01 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. ఈ నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. సికర్, ఫతేపూర్ జిల్లాల్లో దీని ప్రభావం కనిపించింది. ఈ వివరాలను జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. 5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సికర్ జిల్లాలో ఎక్కువ ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. భవనాలు, వాహనాలు అకస్మాత్తుగా కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 


గురువారం స్వల్ప భూకంపం జమ్మూ-కశ్మీరును తాకిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని కాట్రా పరిసరాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 


Updated Date - 2022-02-18T19:15:12+05:30 IST