Low pressure: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

ABN , First Publish Date - 2022-08-07T21:57:01+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Low pressure: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తోందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు (Heavy Rains)  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-08-07T21:57:01+05:30 IST