Advertisement

ముంచుకొస్తున్న గడువు

Oct 28 2020 @ 05:28AM

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో ఐదు రోజులే సమయం

దరఖాస్తుకు ఈనెల 31 వరకే అవకాశం

మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో  భారీగా దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 28,219

ప్రభుత్వానికి ఆదాయం.. సామాన్యులపై భారం

ఎల్‌ఆర్‌ఎస్‌తో భూదందాకు చెక్‌


కామారెడ్డి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : 

ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు ముంచుకొస్తోంది. మరో ఐదు రో జులు మాత్రమే సమయం ఉంది. ఈనెల 31తో గడువు ము గియనుంది. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న భూదందాకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌తో చెక్‌ పెట్టింది. లే అవుట్‌లేని ప్లాట్ల రిజిస్ట్రేషనులు నిలిచిపోవడంతో ఉభయ జి ల్లాల్లో రియల్‌ దందా పడిపోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టి న ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగానే స్పందన వస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ పై ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో అధికా రులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పి ంచడంతో అక్రమ లేఅవుట్‌లను క్రమబద్ధీకరించుకునేందు కు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 28,219 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబు తున్నాయి. రెండు జిల్లాల్లో ఇంకా ఎక్కువగానే అక్రమ ప్లా ట్లు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు ముంచుకొస్తున్న నేప థ్యంలో ఈనెల 31 వరకు మరిన్ని దరఖాస్తు వచ్చే అవకాశా లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంతో ప్రభుత్వాని కి భారీ ఆదాయం రానున్నప్పటికీ.. సామాన్యుల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రూపాయి రూపాయి కూ డపెట్టుకుని ప్లాటు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టేందుకు అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.


ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగానే అక్రమప్లాట్లు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 50వేలకు పైగానే అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. నిజా మాబాద్‌ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 158 అక్రమ వెంచర్లు, 52.60 ఎకరాలలో 19,088 అనుమతి లేని ప్లాట్లు ఉన్నాయి. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో 150 అక్రమ వెంచర్లలో సుమారు 15 వేలకు పైగా అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ర్మూర్‌, బోధన్‌ , భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పరిధిలో 2 వేల వరకు అక్రమ ప్లాట్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 9,257 అక్రమ ప్లాట్లు, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్‌ లేని 82 వెంచ ర్‌లలో 4 వేలకు పైగా అక్రమ ప్లాట్లతో పాటు మరో 15 వేల వరకు ఇతర చోట్ల అక్రమ ప్లాట్లు ఉన్నట్లు మున్సిపల్‌ అధి కారులు గుర్తించారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 600, ఎ ల్లారెడ్డి మున్సిపాలిటీలో 60కి పైగా అక్రమ ప్లాట్లు ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు గుర్తించారు.


ఇప్పటి వరకు 28,819 దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలో అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేం దుకు నెలరోజులుగా ఆయా శాఖల అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్రమ ప్లాట్లు ఉన్న వారు రూ.1000 చెల్లించి ఈ-సేవ, ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకునే అవకా శాన్ని ప్రభుత్వం కల్పి ంచింది. అయితే, ఉ మ్మడి జిల్లాలో ఇ ప్పటివరకు 28, 819 దరఖాస్తులు వచ్చినట్లు మున్సి పల్‌, పంచాయ తీ అధికారుల లె క్కలు చెబుతున్నా యి. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో 5,250 దరఖా స్తులు రాగా, ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 1,250, భీంగ ల్‌లో 99, బోధన్‌లో 1,320 దరఖా స్తులు వచ్చాయి. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రా మ పంచాయతీల పరిధిలో 1,200 దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి మున్సిపాలిటీలో 17 వేల దరఖాస్తులు రాగా, ఎల్లారెడ్డిలో 1,100, బాన్సువాడలో 550 దరఖాస్తులు వచ్చాయి.


లే అవుట్‌లేని వెంచర్లలో స్పందన కరువు

కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా వెంచర్‌లు చేసి అమ్మకాలు జరిపినవా రిలో స్పందన కనిపించడం లేదు. ఇప్పటివరకు కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 82 అక్రమ లేవుట్‌గల వెంచర్లు, 3,991 ప్లాట్లను మున్సిపల్‌ అధికారులు గుర్తించగా కేవలం 3,211 ప్లాట్ల వారు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నా రు. ఎక్కడపడితే అక్కడ ఇష్టరీతిన వెంచర్లు చేసి అమ్మకా లు జరిపిన 82 అక్రమ లేవుట్‌ల వెంచర్లలో ఇప్పటివరకు ఒ క్క దరఖాస్తు రాకపోవడం గమనార్హం. ఎందుకంటే వీటిలో చాలా వరకు వ్యవసాయభూములు ఉండ డం, నిబంధనలకు తగినట్టుగా వెం చర్లు లేకపోవడంతో ఏ విధంగా దరఖాస్తు చేయాలో తెలియ క రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమా చారం. ముఖ్యంగా మున్సిపల్‌ పరిధిలో ని విలీన గ్రామాల్లో ఈ తరహా వెంచ ర్లు ఎక్కువగా ఉం డగా ఇష్టారీతిన వెంచర్లు చేసి అమ్మ కాలు జరిపిన, జరపా లనుకున్న వారి పరిస్థి తి అగమ్యగోచరంగా త యారైందని తెలుస్తోంది. అందుకే వారు దరఖాస్తుకు ముందుకు రావడం లేదు.


ఈనెల 31 వరకు చివరి అవకాశం

లే అవుట్‌ లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అక్టోబరు 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం రూ. 1000 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వెంచర్‌లకైతే దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2020 ఆగస్టు 26వ తేదీలోపు డాక్యుమెంట్‌ కలిగి ఉన్న ప్లాట్‌లను క్రమబద్ధీకరిం చనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌లేని ప్లాట్లలో 10 శాతం ఖాళీ స్థలం చూపించాలని మున్సిపల్‌ చట్టం చె బుతోంది. ఈ ఖాళీ స్థలాలలో దేవాలయం, పార్క్‌, పాఠశాల భవన నిర్మాణాలకు వినియోగించనున్నారు. ఎలాంటి సదు పాయాలు లేకుండా ఏర్పాటుచేసిన ప్లాట్లకు అదనంగా 14 శాతం రుసుం చెల్లించాలని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.