పొంగి పొర్లుతున్న లఖ్నాపూర్ ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-09-26T18:40:35+05:30 IST

వికారాబాద్: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.

పొంగి పొర్లుతున్న లఖ్నాపూర్ ప్రాజెక్టు

వికారాబాద్: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు మూడవ సారి భారీ ఎత్తున పొంగి పొర్లుతోంది. గొడుగోని పల్లి వాగు పొంగడంతో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూబ్ నగర్ కుల్కచర్ల రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు పూర్తిగా బంద్ అయ్యాయి. నస్కల్ వాగు పొంగడంతో వికారాబాద్ రహదారి వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2020-09-26T18:40:35+05:30 IST