రోడ్డు ప్రమాదంలో గాయపడిన లక్నో జట్టు సీఈవో

Published: Fri, 29 Apr 2022 20:55:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోడ్డు ప్రమాదంలో గాయపడిన లక్నో జట్టు సీఈవో

ముంబై: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ సీఈవో రఘు అయ్యర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మ్యాచ్ కోసం కారులో ముంబై నుంచి పూణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జట్టు సభ్యులతో ఉన్న బస్సు ముందు వెళ్తుండగా గౌతం గంభీర్ సహాయకుడు, మరో వ్యక్తితో‌తో కలిసి రఘు అయ్యర్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు తెలుస్తోంది. అయితే, స్వల్ప గాయాలతోనే బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

 

లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆర్పీ గోయెంకా గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన లక్నో అంచనాలకు మించి రాణిస్తూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించి నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.