LSGvsRCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న LSG.. మ్యాచ్ మొదలయ్యేది ఎన్ని గంటలకంటే..

ABN , First Publish Date - 2022-05-26T01:34:58+05:30 IST

వర్షం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది. 7 గంటలకు పడాల్సిన..

LSGvsRCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న LSG.. మ్యాచ్ మొదలయ్యేది ఎన్ని గంటలకంటే..

కోల్‌కత్తా: వర్షం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది. 7 గంటలకు పడాల్సిన టాస్ 7.55 నిమిషాలకు పడింది. 8.10 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు. గౌతమ్, హోల్డర్ స్థానాల్లో క్రూనల్ పాండ్యా, చమీరా ఆడనున్నట్లు తెలిపాడు.



ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఇరు జట్ల అభిమానులు పెద్ద ఎత్తున మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లారు. రెండు జట్లు బలమైనవే కావడంతో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయాన్ని తేల్చడం అంత సులభం కాదు. దినేష్ కార్తీక్ లాంటి Game Changers రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంతో పోల్చితే బెంగళూరు ఎంతో సమతుల్యమైన జట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాజెల్‌వుడ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లతో బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. టాపార్డర్‌లో విరాట్‌ టచ్‌లోకి రావడం పెద్ద సానుకూలాంశం కాగా.. ఫినిషర్‌గా దినేష్‌ కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్‌ స్థాయికి తగ్గ ఆటను ఇంకా ప్రదర్శించలేదు.



మరోవైపు నిలకడైన ప్రదర్శనతో లఖ్‌నవూ ఆకట్టుకుంటోంది. యువ పేసర్లు అవేశ్‌ ఖాన్‌, మొహిసిన్‌ ఖాన్‌ జట్టుకు ప్రధాన బలంగా మారగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ రాహుల్‌, డికాక్‌ మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. క్రునాల్‌, స్టొయినిస్‌ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతో ఉంది. బెంగళూరు ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడే వరకూ రావడం ఇది వరుసగా మూడోసారి. ఈసారైనా ఎలిమినేటర్ మ్యాచ్‌లో నిష్క్రమించే శాపం నుంచి బెంగళూరు జట్టు బయటపడుతుందో లేదో చూడాలి.

Updated Date - 2022-05-26T01:34:58+05:30 IST