లఖ్‌నవూ మరో ఢిల్లీ: సరిహద్దులు మూసేస్తామన్న టికాయత్

ABN , First Publish Date - 2021-07-27T02:04:12+05:30 IST

ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న కిసార్ పంచాయత్ (రైతు పంచాయతీ) నిర్వహిస్తాం. దేశం మొత్తాన్ని మా అదుపులోకి తీసుకుంటాం. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన ఆపబోం. లఖ్‌నవూను మరో ఢిల్లీలా మారుస్తాం

లఖ్‌నవూ మరో ఢిల్లీ: సరిహద్దులు మూసేస్తామన్న టికాయత్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూను మరో ఢిల్లీలా మారుస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఢిల్లీలాగే లఖ్‌నవూ సరిహద్దుల్ని మూసేస్తామని, రైతులతో పెద్ద ఎత్తున లఖ్‌నవూ సరిహద్దులో ఉద్యమిస్తామని తెలిపారు. సోమవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగు ఏళ్లుగా చెరకు రైతులకు ఇచ్చే మద్దతు ధర పెంచలేదని, వారికి కేటాయించిన 12,000 కోట్ల రూపాయల నిధులు ఇంకా అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఈ పరిస్థితి కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే లేదని, మరో 7-8 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని రాకేశ్ టికాయత్ అన్నారు.


‘‘ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న కిసార్ పంచాయత్ (రైతు పంచాయతీ) నిర్వహిస్తాం. దేశం మొత్తాన్ని మా అదుపులోకి తీసుకుంటాం. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన ఆపబోం. లఖ్‌నవూను మరో ఢిల్లీలా మారుస్తాం. లఖ్‌నవూ సరిహద్దులోని అన్ని సరిహద్దులను రైతుల ఆందోళనతో మూసేస్తాం’’ అని రాకేశ్ టికాయత్ అన్నారు. కాగా, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని హర్యానాలోని జింద్‌ రైతులు ప్రకటించారు. దీనికి రాకేశ్ టికాయత్ మద్దతు తెలిపారు.

Updated Date - 2021-07-27T02:04:12+05:30 IST