Salman Khan డూప్లికేట్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-10T01:19:06+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)లా కనిపించే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజం అన్సారీని పోలీసులు

Salman Khan డూప్లికేట్ అరెస్ట్

లక్నో: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)లా కనిపించే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజం అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో రచ్చరచ్చ చేస్తూ శాంతికి విఘాతం కలిగించిన అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్లాక్ టవర్ వద్ద రీల్ చేస్తుండగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సెక్షన్ 151 ప్రకారం ఆయనకు చలాన్ జారీ చేశారు.

 

సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ ‘డూప్లికేట్’ నటుడు తరచూ రోడ్డు మధ్యలో రీల్స్ చేస్తూ ఉంటాడు. అలాగే, కొన్నిసార్లు అర్ధ నగ్నంగా, మరికొన్ని సార్లు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతూ రీల్స్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఈ ఫేక్ సల్మాన్‌ను చూసేందుకు జనం రోడ్డుపై గుమిగూడుతుండడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. కాగా, ఈ డూప్లికేట్ సల్మాన్‌కు యూట్యూబ్‌లో 1,67,000 ఫాలోవర్లు ఉన్నారు. అతడి వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. 

Read more