లక్కీ డిప్‌..!

ABN , First Publish Date - 2022-09-24T05:10:17+05:30 IST

పట్టణంలో చిట్టీలు, లక్కీ డిప్‌ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అధిక వడ్డీ, డిప్పులు, లాటరీ పేరుతో మోసం చేస్తున్నారు.

లక్కీ డిప్‌..!
బోర్డు తిప్పేసిన ఐఎ్‌సఏ

పురంలో మరో మోసం

లక్కీడిప్‌ పేరుతో డబ్బు వసూలు

వాపసు ఇవ్వకుండా 

చేతులెత్తేసిన నిర్వాహకులు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

హిందూపురం, సెప్టెంబరు 23: పట్టణంలో చిట్టీలు, లక్కీ డిప్‌ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అధిక వడ్డీ, డిప్పులు, లాటరీ పేరుతో మోసం చేస్తున్నారు. ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసుకుని, బోర్డు తిప్పేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం తరువాత హిందూపురం అతిపెద్ద పట్టణం. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది. చాలామంది పల్లెల నుంచి పట్టణానికి రోజూ పనికి వస్తుంటారు. అలాంటి వారిని ఆర్థిక మోసగాళ్లు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. రూ.లక్షలు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా లక్కీ డిప్‌ స్కీం పేరుతో జనాన్ని ఆకర్షించి, పెద్ద మొత్తంలో డబ్బు సేకరించిన వ్యక్తులు చేతులెత్తేశారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు.


ఏడాది క్రితం రూ.5 కోట్లకుపైగా మోసం


ఏడాది క్రితం పట్టణంలోని చిన్నమార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి, వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసింది. ఆ తర్వాత సొమ్ము ఇవ్వకుండా మోసం చేసింది. అప్పట్లో ఈమె చేసిన మోసం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. హిందూపురం, గోరంట్ల, మడకశిర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఈమె చేతిలో మోసపోయారు. ముద్దిరెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన మరో మహిళ ఇలాంటి దోపిడీకి స్కెచ వేసింది. ఆమె కూడా రూ.2కోట్లదాకా వందలాది మందికి ఎగ్గొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 


లక్కీ డిప్‌ పేరుతో ముంచేశారు..


తాజాగా లక్కీ డిప్‌ పేరుతో వందలాది మందిని మోసం చేశారు. స్థానిక వనటౌన పోలీసు స్టేషనకు కూతవేటు దూరంలోని ఆబాద్‌పేటకు చెందిన షానూర్‌, బెంగళూరుకు చెందిన ఇర్షాద్‌ మూడేళ్ల క్రితం ఐఎ్‌సఎ (ఇన్వె్‌స్టమెంట్‌ సొల్యూషన అడ్వైజర్‌) పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. స్థానికంగా కార్యాలయం ప్రారంభించారు. మొదట ఆఫర్ల పేరుతో అందరినీ ఆకర్షించారు. నెలకు రూ.వెయ్యి ప్రకారం 20 నెలలు కడితే ప్లాటుగానీ, ఇల్లుగానీ, కట్టిన మొత్తానికి 50 శాతం అదనంగా డబ్బు వాపసు ఇస్తామని ఆశ చూ పారు. దీనికితోడు ప్రతినెలా లక్కీడ్రా తీస్తూ పలువురికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. 3వేల మందికిపైగా సభ్యులను చేర్చుకున్నారు. రూ.6కోట్లకుపైగా టర్నోవర్‌ చేసినట్లు సమాచారం. మొదట చాలామందికి స్కీం పూర్తికాగానే డబ్బు ఇస్తూ వచ్చారు. ఏడాది స్కీం కాల వ్య వధి పూర్తయిన వారికి డబ్బు ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి, డబ్బు కట్టించుకున్న వా రిని నిలదీశారు. ఇ టీవల కార్యాలయం తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


బహుమతులతో ఎర


గ్రామీణ ప్రాంతానికి చెందిన కూలీలు, చిరు వ్యాపారులను ఆకర్షణీయమైన బహుమతుల ఆశచూపి, మోసం చేశారు. లక్కీడ్రా అంటూ ప్రతినెలా రూ.వెయ్యి కడితే టీవీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్రవాహనాలు, పది గ్రాముల బంగారం ఇస్తారని నమ్మబలికారు. వీటికి మోసపోయిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.


Updated Date - 2022-09-24T05:10:17+05:30 IST