వింత పెళ్లి.. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను ఎదురించి ఒక్కటయ్యారు!

Jul 21 2021 @ 14:12PM

ఆ ఇద్దరు యువతులు బంధువులు.. పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని పక్క పక్క గ్రామాల్లో నివసిస్తుంటారు.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు.. రెండేళ్ల క్రితమే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.. గ్రామస్తులు అడ్డు తగలడంతో ఆగిపోయారు.. ఇప్పుడు ఎవరినీ పట్టించుకోలేదు.. ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరు యువతుల్లో ఒక యువతి సోదరుడు ఈ పెళ్లికి మద్దతుగా నిలిచి కన్యాదానం చేయడం విశేషం.


లూథియానాలోని స్వద్ధి కలన్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుపడ్డారు. దీంతో తాజాగా వీరిద్దరూ ఓ గుళ్లో వివాహం చేసుకున్నారు. వారిద్దరిలో ఓ యువతి సోదరుడు పెళ్లికి హాజరై కన్యాదానం కూడా చేశాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు షాకయ్యారు. అయితే ఏమీ చేయలేక ఊరుకున్నారు. కాగా, ఈ పెళ్లి విషయం తెలిసి వీరిద్దరిలో ఒక యువతిని కుటుంబ సభ్యులు వెలివేశారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...