షరతు ప్రకారం పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువు.. ఆర్నెళ్లలోనే..

Sep 25 2021 @ 19:53PM

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లై, కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పెట్టుకున్న వీసా అప్లికేషన్ రిజెక్ట్ కావడంతో అప్పటి వరకు బాగానే చూసుకున్న భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆమెకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. అత్తారింట్లోని ఇతర కుటుంబ సభ్యులు కూడా వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై హత్యయత్నం కూడా జరిగింది. పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఈ ఘటనుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లోని 22ఏళ్ల జస్ప్రీత్ కౌర్‌.. IELTS టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే విదేశాల్లోకి వెళ్లి, అక్కడే సెటిల్ అవ్వాలను భావిస్తున్న సుఖ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి.. ఆమె వద్దకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. జస్ప్రీత్ కౌర్ విదేశాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అయితే పెళ్లి తర్వాత భాగస్వామి వీసా మీద తనను కూడా విదేశాలకు తీసుకెళ్లాలని షరతు విధించాడు. దీనికి జస్ప్రీత్ కౌర్, ఆమె కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు. ఈ క్రమంలో జస్ప్రీత్ కౌర్‌ను సుఖ్‌దీప్ సింగ్ ఆరునెలల కింద పెళ్లి చెసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటికే IELTS టెస్ట్‌ను పూర్తి చేసిన జస్ప్రీత్ కౌర్.. ఆస్ట్రేలియా, కెనడా వీసాల కోసం అప్లై చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆమె అప్లికేషన్‌లు రిజెక్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని సుఖ్‌దీప్ సింగ్, అతడి కుటుంబ సభ్యలు తట్టుకోలేకపోయారు. విడాకుల కోసం జస్ప్రీత్ కౌర్‌ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తారా స్థాయికి చేరాయి. జస్ప్రీత్ కౌర్‌పై ఆమె భర్త, కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జస్ప్రీత్ కౌర్‌.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.