ఆత్మకూర్‌(ఎస్‌)లో లంపిస్కిన్‌ వైరస్‌

ABN , First Publish Date - 2022-10-08T06:16:24+05:30 IST

సూర్యాపేట జిల్లాలో లంపిస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. ఆవుకు బొగ్గలు రావడంతో అనుమానంతో పరీక్షలు ని

ఆత్మకూర్‌(ఎస్‌)లో లంపిస్కిన్‌ వైరస్‌
ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో లంపిస్కిన్‌ వ్యాధి సోకిన పశువు

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 7 : సూర్యాపేట జిల్లాలో లంపిస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. ఆవుకు బొగ్గలు రావడంతో అనుమానంతో పరీక్షలు నిర్వహించి, లంపిస్కిన్‌గా గుర్తించా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో ఉప్పుల లింగయ్యకు చెందిన ఆవు కుంటుతుండడంతో రైతు ఆవును వెటర్నరీ ఆస్పత్రికి శుక్రవారం తీసుకువచ్చాడు. ఆవు కుడివైపు చర్మంపై అసాధారణంగా బొగ్గలు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానిక పశు వైద్య శాఖ అధికారి వేణుగోపాల్‌ పరీక్షలు నిర్వహించి, నివారణ కోసం రైతుకు తగు సూచనలు చేశారు. జిల్లాలో 23 పశువులకు లంపిస్కిన్‌ వ్యాధి సోకినట్లు ఽఅధికారులు గుర్తించారు. చింతలపాలెం, మోతె, మేళ్లచెర్వు, కోదాడ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆవులకు ఈ వ్యాధి సోకింది.  

నేటి నుంచి వ్యాక్సినేషన్‌

జిల్లాలో లంపిస్కిన్‌ వ్యాధి నివారణకు నేటి నుంచి వ్యాక్సినేషన్‌ కా ర్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లంపిస్కిన్‌ను గుర్తించిన ప్రాంతా ల్లో 5కిలోమీటర్లలోపు ఉన్న గ్రామాల్లోని పశువులన్నింటికీ మొదటగా వ్యాక్సిన్‌ వేస్తారు. జిల్లామొత్తం మీద 65వేల ఆవులు ఉన్నాయి.వీటన్నింటికి విడతలవారీగా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. 2,85లక్షల గేదే లు ఉన్నాయి. వీటికి కూడా దశలవారీగా వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. చర్యలు తీసుకుంటున్నాం

లంపిస్కిన్‌ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పశువైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరావు తెలిపారు. ప్రస్తుతం ప్రతి మండలానికి వెయ్యి డోసులు వ్యాక్సిన్‌ సిద్ధం చేశామని, 10వేల డోసుల బఫర్‌ స్టాక్‌ కూడా సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైతే వ్యాధి లక్షణాలను గుర్తించారో అక్కడ అక్కడ మొదట ప్రాధ్యానంగా వ్యాక్సినేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. లంపిస్కిన్‌ వ్యాధి సోకిన ఆవులను మంద నుంచి వేరు చేయాలన్నారు. రాత్రి పూట వేపాకు పొగ వేయాలన్నారు.

- శ్రీనివా్‌సరావు, పశువైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ 

Updated Date - 2022-10-08T06:16:24+05:30 IST