లంగ్‌ ఇమ్యూనిటీ!

ABN , First Publish Date - 2020-11-17T05:30:00+05:30 IST

కరోనా నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం అత్యవసరం. ఇందుకోసం ఊపిరితిత్తుల రోగనిరోధకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టాలి...

లంగ్‌ ఇమ్యూనిటీ!

కరోనా నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం అత్యవసరం. ఇందుకోసం ఊపిరితిత్తుల రోగనిరోధకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టాలి. లంగ్‌ కెపాసిటీని పెంచే కొన్ని నియమాలు పాటించాలి!


ప్రాణాయామం: ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలంటే ప్రాణాయామం సాధన చేయాలి. ఒత్తిడికి లోనయినప్పుడు ఆ ప్రభావం శ్వాస మీద పడుతుంది. ఫలితంగా ఊపిరి పీల్చుకుని, వదిలే వేగం పెరిగి ఊపిరితిత్తులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తొలగి శ్వాస వేగం అదుపులో ఉంటుంది. 

హానికారక పదార్థాలు: శరీరంలో కఫాన్ని పెంచే పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడిని తగ్గించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్‌ అయిన ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలి.

కాలుష్యం: లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత కాలుష్యం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే! అయితే పట్టణాలను వదిలి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి, వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

మాస్క్‌: వ్యాధికారక సూక్ష్మక్రిములను అడ్డుకోవడంతో పాటు వాతావరణంలో కలిసిన దుమ్ము, ధూళి, పొగలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోకుండా  ఉండాలంటే ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన ప్రతిసారీ మాస్క్‌ ధరిస్తూ ఉండాలి.

Updated Date - 2020-11-17T05:30:00+05:30 IST