వైద్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న సైక్రియాసిస్ట్ క్రిస్టియా
సంగం, మే 16: స్థానిక వైద్యశాలలో సోమవారం వైద్య సిబ్బందికి సైక్రియాసిస్ట్ క్రిస్టియా మానసిక రోగులపై అవగాహన నిర్వహించారు. మానసిక రోగులు, లక్షణాలు, నయం చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇక నుంచి ప్రతి సోమవారం వైద్యశాల్లో మానసిక రోగులకు చికిత్స చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.