మచిలీపట్నం వద్ద బలహీన పడిన ‘అసని’ తుఫాన్

ABN , First Publish Date - 2022-05-12T14:21:36+05:30 IST

కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరం దాటిన ‘అసని’ తుఫాను... మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిందని

మచిలీపట్నం వద్ద బలహీన పడిన ‘అసని’ తుఫాన్

అమరావతి: కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరం దాటిన ‘అసని’(Asani) తుఫాను... మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీన పడిందని ఏపీ విపత్తుల  ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. గత 6 గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందని తెలిపారు. కొన్ని గంటలు  ఇదే  ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో  కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, బలహీన పడినప్పటికీ ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.

Read more