Machilipatnam దళితుల భూములపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-05-12T22:09:03+05:30 IST

Machilipatnam దళితుల భూములపై హైకోర్టులో విచారణ

Machilipatnam  దళితుల భూములపై హైకోర్టులో విచారణ

అమరావతి: మచిలీపట్నం (Machilipatnam) దళితుల భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 60 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన 112 ఎకరాలను.. అనుచరులకు కట్టబెట్టాలని వైసీపీ సర్కార్ భావించింది. అయితే వాదనలు విన్న హైకోర్టు... ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తమ భూమి స్వాధీనం చేసుకోవడంపై బాధితుల పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 60 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన భూములను లాక్కోవడం చట్టవిరుద్దమని లాయర్ శ్రవణ్‌కుమార్ వాదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు భూమి బదలాయించవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది. 

Read more