యంత్ర నగిషి.. గిరిపుత్రిక ఖుషి!

Sep 26 2021 @ 00:00AM
కుట్టు యంత్రంపై శిక్షణ తీసుకుంటున్న గిరిజన మహిళలు

  • రూ. 1.60 కోట్లతో యంత్రాల కొనుగోలు
  • కుట్లు, నగిషీలు, దుస్తుల తయారీపైౖ అవగాహన 
  • గిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో పెద్దతండా మహిళలకు శిక్షణ


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): లంబాడ తండాల్లో మహిళల వేషధారణ, భాష, సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ప్రత్యేక జీవన శైలితోపాటు, అపురూప నృత్యాలు, అద్దాల దుస్తులు, చేతులనిండా గాజులతో అలంకరణలు అందరిని ఇట్టె అకట్టుకుంటాయి. లంబాడ సంస్కృతికి సంబంధించిన దుసులు, గాజులు, ఇతర అలంకరణ సామగ్రి తయారీకి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటిదుస్తులు, ఇతర సామగ్రి తయారీకి రోజుల తరబడి శ్రమించాల్సి వచ్చేది. ప్రస్తుతం నూతన సాంకేతిక  పరిజ్ఞానంతో గిరిజన మహిళలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. యంత్రాల సాయంతో గంటల్లో లంబాడా దుస్తులు, సామగ్రి తయారు చేయడానికి గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పెద్దతండాలో గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనశాఖ హబ్‌ నుంచి 70 శాతం నిధులు (రూ.1.12 కోట్లు) ఇస్తారు. 30శాతం నిధులను లబ్ధ్దిదారులు తమవంతు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. గిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో గిరిజన మహిళలకు సాంకేతికతపై శిక్షణ ఇవ్వడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల(ఐఏఆర్‌ఈ) చైౖర్మన్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి ముందు కొచ్చారు. లబ్ధిదారుల వాటా 30 శాతం (ర ూ. 48 లక్షలు) నిధులు, కేంద్ర నిధులు మొత్తం రూ.1.60 కోట్లతో యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. శిక్షణ భవన నిర్మాణం కూడా చేపట్టి  గిరిజన మహిళలకు ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఎంబ్రాయిడింగ్‌,  లేజర్‌ కటింగ్‌, గాజుల వెల్డింగ్‌, గిరిజన దుస్తులపై అద్దాలతో పాటు ఇతర సామగ్రిని కుట్ట         డానికి, అతికించడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయించారు. ఈ యంత్రాలపై రోజుకు మూడు షిప్టుల్లో 20 మంది చొప్పున 60 మందికి  శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో గిరిజనుల కోసం ఇలాంటి టెక్నాలజీ యంత్రాలను వినియోగించడం ఇదే మొదటి సారి అని గిరిజన సంక్షేమాధికారి శత్రునాయక్‌ తెలిపారు.

 శిక్షణ అనంతరం స్వయంసమృద్ధి

శిక్షణ పూర్తయిన అనంతరం  గిరిజనులకు సంబంధించిన కుండలు, దేవతల బొమ్మలు, దుస్తులు  తయారు చేసి స్వయంగా విక్రయించనున్నారు. ఎగ్జిబిషన్లలో ఈ వస్తువుల అమ్మకాలు  చేపట్టనున్నారు. అయితే వస్తువుల తయారీకి సరపడా ముడిసరుకును ఉచితంగా గిరిజనులకు అందించడానికి రాజశేఖర్‌రెడ్డి ముందుకొచ్చారు. 

Follow Us on: