ఇసుక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-10-04T04:43:03+05:30 IST

ఇసుక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ బ్యూరో ఉక్కుపాదం మోపుతుందని సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు కుమార్‌ తెలిపారు.

ఇసుక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సంగమేశ్వరుడి దర్శనంలో సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు కుమార్‌

సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌  


సంగం, అక్టోబరు 3: ఇసుక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ బ్యూరో ఉక్కుపాదం మోపుతుందని సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన సంగంలోని సంగమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగం బ్యారేజీ, ఆనకట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. అదేవిధంగా గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు సెబ్‌ నిరంతరం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, వీటి బారిన పడకుండా కళాశాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 


Updated Date - 2022-10-04T04:43:03+05:30 IST