Madapur case: మాదాపూర్ కాల్పుల కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-02T20:56:04+05:30 IST

మాదాపూర్‌లో నిన్న జరిగిన కాల్పుల కేసు (Firing case)ను సైబరాబాద్ పోలీసులు చేధించారు.

Madapur case: మాదాపూర్ కాల్పుల కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ (Hyderabad): మాదాపూర్‌ (Madapur)లో నిన్న జరిగిన కాల్పుల కేసు (Firing case)ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. రౌడీషీటర్ ఇస్మాయిల్‌పై ముగ్గురు నింధితులు గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యారు. నింధితులను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసిన పోలీసులు.... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వెపన్స్, కార్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.


మాదాపూర్‌లో ఇస్మాయిల్‌ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌(Point blank)లో కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌తో పాటు మరో వ్యక్తి జహంగీర్‌పై కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ మృతి చెందగా... జహంగీర్ పరిస్థితి విషమంగా ఉంది. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. ఇస్మాయిల్‌, జహంగీర్‌, మహ్మద్‌ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదం కొంతకాలంగా నడుస్తోంది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మహ్మద్‌ వారిద్దరినీ నీరూస్‌ దగ్గరికి పిలిచాడు. వీరి మధ్య కొంతసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. చర్చలు జరుగుతుండగానే మహ్మద్‌ ఫైరింగ్‌ ఓపెన్‌ చేసినట్టు సమాచారం. ఇస్మాయిల్‌ పక్కన ఉన్నవారిని చెదరగొట్టేందుకు.. మరో వెపన్‌తో జిలానీ అనే వ్యక్తి సైతం మహ్మద్‌కు మద్దతుగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇద్దరిపై కాల్పులు జరిపిన అనంతరం మహ్మద్‌, జిలానీ అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రగాయాలపాలైన ఇస్మాయిల్‌ను అతని మిత్రులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Updated Date - 2022-08-02T20:56:04+05:30 IST