
వాషింగ్టన్ : అమెరికా మొదటి మహిళా సెక్రటరీ మడేలిన్ ఆల్బ్రైట్ కన్నుమూశారు. బాల శరణార్థిగా అమెరికాకు వచ్చి 20వ శతాబ్దం చివర్లో అమెరికా విదేశాంగ విధానాన్ని రూపొందించి తొలి మహిళా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎదిగిన మడేలిన్ ఆల్బ్రైట్ 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మడేలిన్ ను యునైటెడ్ నేషన్స్‌కు రాయబారిగా అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ నియమించారు. యూఎస్ అగ్ర దౌత్యవేత్తగా ఆల్బ్రైట్ ప్రభావవంతంగా పనిచేశారు.మడేలిన్ మృతికి క్లింటన్ సంతాపం తెలిపారు. ‘‘స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పనిచేసిన మడేలిన్ మృతి ప్రపంచానికి తీరని లోటు’’ అని క్లింటన్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
‘‘ఆల్బ్రైట్ చరిత్రను మార్చి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు’’ అని ప్రెసిడెంట్ జో బిడెన్ వ్యాఖ్యానించారు. క్లింటన్ 1997లో స్టేట్ డిపార్ట్మెంట్కు అధిపతిగా ఆల్బ్రైట్ను ఎంచుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏకైక సూపర్ పవర్‌గా అవతరించిన ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో ఆల్బ్రైట్ స్టేట్ డిపార్ట్మెంట్కు సారథ్యం వహించారు. 1937 వ సంవత్సరం మే మే 15వతేదీన చెకోస్లోవేకియాలో మేరీ జానా కోర్బెలోవాగా జన్మించిన ఆల్బ్రైట్ 1948లో తన కుటుంబంతో కలిసి శరణార్థిగా అమెరికాకు వచ్చి 1957లో యూఎస్ పౌరసత్వం పొందారు.ఆమె తండ్రి జోసెఫ్ కోర్బెల్ దౌత్యవేత్త.
ఇవి కూడా చదవండి