హేమంత్ హత్య కేసు గురించి డీసీపీ చెప్పిన నిజానిజాలివీ...

ABN , First Publish Date - 2020-09-25T23:57:36+05:30 IST

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరువక ముందే భాగ్యనగరంలో జరిగిన మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించిన విషయం విదితమే.

హేమంత్ హత్య కేసు గురించి డీసీపీ చెప్పిన నిజానిజాలివీ...

హైదరాబాద్ : మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరువక ముందే భాగ్యనగరంలో జరిగిన మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించిన విషయం విదితమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. యువకుడిని కిడ్నాప్ చేయించి అతి కిరాతకంగా హత్య చేయించాడు. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని ఈ దారుణానికి పాల్పాడ్డారు. కాగా ఈ కేసుకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా మీట్ నిర్వహించి నిజానిజాలు వెల్లడించారు.


హత్య జరిగిందిలా..!

ఈ మర్డర్ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశాం. జూన్‌లో వివాహం అయ్యింది. అదే క్రమంలో మిస్సింగ్ కేసు నమోదైంది. గతంలో చందానగర్‌లో ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చాం. ఈనెల 20న లక్షారెడ్డి, యుగేంధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. 10లక్షలకు ముగ్గురితో ఒప్పందం చేసుకున్నారు.లక్ష రూపాయిలు అడ్వాన్స్‌గా కూడా తీసుకున్నారు. ఎరుకల కృష్ణ, బిచ్చు యాదవ్, బాషా కిరాయి హంతకులు. మూడు కార్లలో నిందితులు హేమంత్ నివాసానికి వెళ్ళారు. బలవంతంగా ఇద్దర్నీ 3:30 గంటలకు లాక్కెళ్లారు. గోపని పల్లిలో 4:30 కారు మార్చి హేమంత్‌ను మరో కారులో తరలించారు. అదే సమయంలో 100కాల్‌తో పోలీసులు స్పాట్ చేరుకున్నారు. అందరిని పీఎస్‌కు తరలించాం. యుగేంధర్ రెడ్డి ఫోన్ స్విచాఫ్ చేసి కిరాయి హంతకులతో హేమంత్‌ను తరలించారు. ఓఆర్ఆర్ మీదుగా జహీరాబాద్‌లో మద్యం, తాడు కొనుగోలు చేశారు. హేమంత్ చేతులు, కాళ్లను ఆ హంతకులు కట్టేశారు. అనంతరం తాడుతో గొంతుకు బిగేసి కారులోనే హత్య చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో మృతదేహాన్ని పడేశారు. పటాన్‌చెరుకు చేరుకొని మరో ఇద్దరితో కలిసి నిందితులు మద్యం సేవించారు. అక్కడి నుంచి సంతోష్ రెడ్డికి ఫోన్ చేశారు. అప్పటికే పోలీసుల అదుపులో సంతోష్ రెడ్డి ఫోన్ సిగ్నల్ ఆధారంగా యుగేంధర్ రెడ్డిని గుర్తించాం. మొత్తం పదిలక్షలతో కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నారుఅని వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.



Updated Date - 2020-09-25T23:57:36+05:30 IST