పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదమని వివాహితను నమ్మించి...

ABN , First Publish Date - 2020-09-23T20:07:06+05:30 IST

హైదరాబాద్: పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదమంటూ మాయమాటలు చెప్పి ఓ వివాహిత మెడలో తాళి కట్టి బెదిరింపులకు పాల్పడుతున్న కోసూరి మాధవ్, అతడి స్నేహితుడు రాఘవ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.

పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదమని వివాహితను నమ్మించి...

హైదరాబాద్: పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదమంటూ మాయమాటలు చెప్పి ఓ వివాహిత మెడలో తాళి కట్టి బెదిరింపులకు పాల్పడుతున్న కోసూరి మాధవ్, అతడి స్నేహితుడు రాఘవ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతిష్యుడిని అంటూ బాధితురాలికి మాధవ్ పరిచయమయ్యాడు. జాతకంలో దోషం వల్ల బాధితురాలికి పక్షవాతం, ఆమె భర్తకు ప్రాణపాయం ఉందని ఆమెను నమ్మించాడు. భర్త లేని సమయంలో పూజ చేయాలంటూ, బాధితురాలికి మాయమాటలు చెప్పి.. ఆమె మెడలో తాళి కట్టాడు. తాళి కట్టాక ఆమె తన భార్యంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్‌ను బాధితురాలి ఫోన్‌కి నిందితుడు పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాధవ్‌ను, అతడికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు రిమాండుకు తరలించారు. 

Updated Date - 2020-09-23T20:07:06+05:30 IST