మది నిండుగ.. జెండా పండుగ..

ABN , First Publish Date - 2022-08-16T06:32:52+05:30 IST

మది నిండుగ.. జెండా పండుగ..

మది నిండుగ.. జెండా పండుగ..
గన్నవరం టీడీపీ కార్యాలయంలో జాతీయ నేతల చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ అర్జునుడు, టీడీపీ నాయకులు

గన్నవరం, ఆగస్టు 15 :  మండలంలో స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, టీడీపీ నియోజకవర్గవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలన్నారు. టీడీపీ వ్యవ స్థాపకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు ఆళ్ళ గోపాలకృష్ణ, జూపల్లి సురేష్‌, జాస్తి వెంకటేశ్వరరావు, బోడపాటి రవికుమార్‌, మేడేపల్లి రమాదేవి, నిమ్మ కూరు మధు, చిక్కవరపు నాగమణి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజి బెత్‌ రాణి, నాయకులు పడమట సురేష్‌, మేచినేని బాబు తదితరులు పాల్గొన్నారు. సెమన్‌ బ్యాంకులో చైర్మన్‌ కొత్త నాగేంద్ర కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. డాక్టర్‌ కె.మౌనీష్‌ పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అనగాని రవి  జెండా ఎగురవేశారు.

విజయవాడ రూరల్‌ మండలంలో..

విజయవాడ రూరల్‌  : మండలంలో  స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.  రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌ బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి జాతీయ పతాకాలను ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాలలో ఇన్‌చార్జి ఎంపీడీఓ బీఎల్‌వీ శేషగిరిరావు, డిప్యూటీ తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  రామవరప్పాడులో సర్పంచ్‌ వరి శ్రీదేవి, ప్రసాదంపాడు సర్నాల గంగారత్నం, ఎనికేపాడులో రాచమళ్ల పూర్ణచంద్రరావు, నిడమానూరులో సర్పంచ్‌ శీలం రంగారావు, గూడవల్లిలో కొలుసు సముద్రవేణి, నున్నలో సర్పంచ్‌ కె సరళ, పాతపాడులో దేవగిరి సుజాత, పీ నైనవరంలో బట్టా సోమయ్య, అంబాపురంలో గండికోట సీతయ్య జాతీయ పతాకాలను ఎగురవేశారు. అలాగే నున్న పాల సంఘం ఆవరణలో చైర్మన్‌ బొంతు శ్రీనివా్‌సరెడ్డి, నున్న సొసైటీ వద్ద అధ్యక్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, తగరం మంజుల జాతీయ పతాకాలను ఎగురవేశారు. 

పెనమలూరు మండలంలో..

పెనమలూరు  : ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యజించి సాధించుకున్న త్యాగఫలాలు అందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరంకిలోని టీడీపీ  కార్యాల యం, పెనమలూరు కూడలిలో దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జెండాను ఎగురవేశారు. పోరంకి నుంచి అశోక్‌నగర్‌ చెక్‌పోస్టు వరకు బైకు ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, తాడిగడప టీడీపీ అధ్యక్షు డు అనుమోలు ప్రభాకరరావు, పార్టీ సీనియర్‌ నాయ కులు అంగిరేకుల మురళి, దొంతగాని మల్లేశ్వ రరావు, జంపాన గుర్నాధరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, షేక్‌ బుజ్జి, కుర్రా నరేంద్ర, యార్లగడ్డ సుచిత్ర, పాలడుగు వినీల తదితరులు పాల్గొన్నారు.

స్థానిక శ్రీ చిగురుపాటి కృష్ణవేణి పాఠశాలలో డైరెక్టరు చంద్రశేఖరరావు, ప్రిన్సిపాల్‌ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోరంకి నారాయణపురం కాలనీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గుత్తా రామ కృష్ణ  నాగుల రాజు, బొర్రా సూర్యప్రసాదరావు, కొమ్మి నేని రాజేష్‌, లక్ష్మీనారాయణ, శివరామరాజు, రత్నాక రరావు, పూర్ణచంద్రరావు, నాగేఽశ్వరరావు, వెంకటేశ్వ రరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

 ఉయ్యూరులో..

ఉయ్యూరు  : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడు కలు వాడవాడలా ఆనందోత్సాహాలతో నిర్వహిం చారు. ఉయ్యూరు పట్టణ పరిధిలో నగర పంచాయతీ కార్యాలయం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వీరమ్మ ఆలయ సమీపాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ సారథి, చైర్మన్‌ సత్యనారాయణ పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో ఎన్‌ విజయ్‌ కుమార్‌ జాతీయ పతాకం ఎగురవేసి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద చైర్మన్‌ జంపాన కొండలరావు, కూనపరెడ్డి నగర్‌  అంగన్‌వాడీ కేంద్రం వద్ద  కొండలరావుతో పాటు సంఘ సేవకురాలు నర్రా సుధారాణి, వార్డు కౌన్సిలర్‌ గోన మదన్‌, రైతు బజార్‌లో వైస్‌ చైర్మన్‌ సోలే సురేష్‌ జాతీయ జెండా ఎగుర వేశారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు వద్ద జడ్జి  బి. బేబీరాణి  జాతీయ పతాకం ఆవిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. తాండవలక్ష్మి థియేటర్‌ సెంటర్‌లో జరిగిన స్వాతంత్ర  దినోత్సవ వేడుకలో  మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు.   వాకర్‌ ్స అసోసియేషన్‌, లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో  పట్టణ ఎస్సై వీరప్రసాద్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ కో- ఆర్డినేటర్‌ నూకల సాంబశివరావు పాల్గొని జాతీయ పతాకం ఎగుర వేశారు. టీడీపీ ఆధ్వర్యంలో కాకాని పార్కు సెంటర్‌ వద్ద  మాజీ కౌన్సిలర్‌ జరీనా బేగం, రఫీ ఆధ్వర్యంలో  టీడీపీ నాయకులు పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. ముదునూరులో మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ వద్ద  వెల్ఫేర్‌ ట్రస్టు మెంబరు పి. రత్న ప్రసాద్‌, గండిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద సర ్పంచ్‌ గెత్తం అనుపమ జెండా వందనం చేశారు. 

కంకిపాడు మండలంలో..

కంకిపాడు  : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈడుపుగల్లులో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పంది పాటి ఇందిర, మాజీ సర్పంచ్‌ షేక్‌ మాబు సుబాని, టీడీపీ నాయకులు షేక్‌ షకార్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, పార్టీ నాయకులు బొప్పూడి శివరామకృష్ణ, జరుగు శ్రీనివాసరావు, విక్రం, సలీం, బొర్రా వెంకట్‌, సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు.  వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన  వేడుకల్లో పార్టీ సీనియర్‌ నాయకులు మాదు వసంతరావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె. పార్థసారథి, వైస్‌ ఎంపీపీ దూళిపూడి కిషోర్‌, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఓంకారం, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో స్థానిక గన్నవరం రోడ్డు కూడలి లో బోయిన రోహిణి జెండా ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పులి కామేశ్వరరావు, ముప్పా రాజా, నాగ రాజు, గుంటా గంగాధర్‌, పచ్చిపాల శేఖర్‌, తన్నీరు చిన్నా, కోన జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన  వేడుకల్లో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీవో దుర్గాప్రసాద్‌, సిబ్బంది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ జెండా ఆవిష్కరించారు.  పోలీసు స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించినవేడుకల్లో సీఐ కాశీవిశ్వనాధ్‌, ఎస్సై దుర్గారావు సిబ్బంది పాల్గొన్నారు. 

 హనుమాన్‌ జంక్షన్‌లో..

హనుమాన్‌జంక్షన్‌  : స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా మండల కేంద్రమైన బాపులపాడులో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు సోమవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వై.నగేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు కె.గంగా భవాని జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ మల్లికార్జునరావు, పీఎస్‌ వద్ద ఎస్సై టి.సూర్యశ్రీనివాస్‌, బాపులపాడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ సరిపల్లి కమలాబాయి, స్రవంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ట్రస్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు వీరమాచనేని సత్య ప్రసాద్‌, శ్రీదేవి పతాకావిష్కరణ చేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు. పాలశీతల కేంద్రం వద్ద  విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు జెండా ఆవిష్కరించారు. టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు జెండా అవిష్కరించారు.నారాయణ స్కూల్‌లో ఎస్సై టి.సూర్యశ్రీనివాస్‌   జెండా ఆవిష్కరించారు.   జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ షేక్‌ ఇషా్‌ఫ్‌, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సుంకర సుభా్‌షచంద్రబోస్‌, జడ్పీటీసీ మెంబర్‌ గంగాభవాని పాల్గొన్నారు. ఆదిత్య బధిర విద్యాలయంలో ఏపూరు సర్పంచ్‌ సీహెచ్‌.రామకృష్ణ పతాకావిష్కరణ చేశారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  :  బాపులపాడు మండల గ్రామాల్లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. కాకులపాడు పాల సొసైటీ ఆవరణలో కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు జెండా వందనం చేశారు. మడిచర్ల ఎంపీయూపీ స్కూల్‌ విద్యార్ధులు స్వాతంత్య్ర సమర యోధుల వేషధారణలతో సర్పంచ్‌ ఆజ్మీరా శాంతమ్మ, చెరుకూరి శ్రీనివాస్‌ తదితరులతో కలిసి గ్రామ వీధులలో ప్రదర్శన నిర్వహించారు. తదనంతరం నాడు-నేడు నిర్మాణ పనులకు శంకుస్ధాపనచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూక్యాదేవి, పుట్టా మదన్‌మోహనరావు, చళ్లగుళ్ల జ్ఞానసాయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెరికీడులో రాణా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగాపై అవగాహన కల్పిస్తూ మాజీ ఎంపీటీసీ బేతాళ ప్రమీలారాణి, ప్రవీణ్‌ ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.  

వీరవల్లి, రంగన్నగూడెం, కే.సీతారాంపురం, వేలేరు, రేమల్లె తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు తిరంగా వేడుకలు నిర్వహించారు. వీరవల్లి టీడీపీ అధ్యక్షుడు లంక సురేంద్ర మోహన బెనర్జీ కూడలిలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిజెండా వందనం చేశారు.   ఈ కార్యక్రమంలో గుండపనేని ఉమావరప్రసాద్‌, ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనా రాయణ, మండాది రవీంద్ర, కలపాల నాని, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. కే.సీతారాంపురంలో టీడీపీ బందరు పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి చెన్నుబోయిన శివయ్య జెండా వందనం చేశారు.  రంగన్నగూడెం రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాగునీటి సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ జెండా వందనం చేశారు.  

ఉంగుటూరు  :  మండలంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలతోపాటు, గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వడ్లమూడి సరోజిని, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ డి.వనజాక్షి, ఆత్కూరు, ఉంగుటూరు పోలీ్‌సస్టేషన్లలో ఎస్సైలు సీహెచ్‌ కిషోర్‌కుమార్‌, జి.రాజు, ఉంగుటూరు, తేలప్రోలు విద్యుత్‌ ఉపకేంద్రాల్లో ట్రాన్స్‌కో ఏఈలు ఎ.సూర్యప్రకాష్‌, యు.మురళీకృష్ణ, పాఠశాలల్లో పేరెంట్స్‌కమిటీ ఛైర్మన్లు, 27గ్రామ పంచాయతీల్లో ఆయాగ్రామ సర్పంచ్‌లు, పీఏసీఎ్‌సలలో చైర్మన్లు త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. వేమండ గ్రామ సచివాలయంలోస్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సర్పంచ్‌ హనుమోలు నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 75 మంది వృద్ధులకు సర్పంచ్‌ నిర్మల, కోటేశ్వరరావు దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రస్ట్‌ కార్యదర్శి చుక్కపల్లి ఆర్‌.కె.ప్రసాద్‌, సీఈవో శరత్‌బాబు, డైరెక్టర్‌ పరదేశి, వివిధ ట్రేడులకు సంబంధించిన అధ్యాపకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు. తేలప్రోలులోని బల్క్‌మిల్క్‌కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీ)లో కృష్ణామిల్క్‌ యూనియన్‌ పాలక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటబాలవర్ధనరావు జాతీయజెండాను ఎగురవేశారు.

Updated Date - 2022-08-16T06:32:52+05:30 IST