Maduraiలో మావోయిస్టు కలకలం ?

ABN , First Publish Date - 2021-11-27T13:59:56+05:30 IST

మదురై జిల్లాలో ఓ మావోయిస్టు దాగి వున్నట్టు అందిన సమాచారం మేరకు క్యూబ్రాంచ్‌ పోలీసులు ఒకేరోజు 20కి పైగా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. అలాగే, తేని జిల్లాలో మరో బృందం మావోయిస్టు కోసం

Maduraiలో మావోయిస్టు కలకలం ?

                - ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు 


అడయార్‌(చెన్నై): మదురై జిల్లాలో ఓ మావోయిస్టు దాగి వున్నట్టు అందిన సమాచారం మేరకు క్యూబ్రాంచ్‌ పోలీసులు ఒకేరోజు 20కి పైగా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. అలాగే, తేని జిల్లాలో మరో బృందం మావోయిస్టు కోసం వెతుకుతోంది. తేని జిల్లా ఉత్తమపాళయం, పన్నైపురానికి చెందిన కార్తీక్‌ (25) అనే వ్యక్తి గత ఐదేళ్ళ క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీనిపై అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో మావోయిస్టులతో కార్తీక్‌ కు సంబంధాలున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో అతను మదురై, తేని జిల్లాల్లో దాగివుండొచ్చన్న సమాచారంతో రెండు జిల్లాలకు చెందిన క్యూ బ్రాంచ్‌ పోలీసులు మదురై జిల్లాలో సమయనల్లూరు, తేనూర్‌, బీబీకుళం, అన్నానగర్‌, గోమతిపురం, కూడల్‌నగర్‌, తిరుమంగళం, ఉసిలంపట్టితో పాటు 20కి పైగా ప్రాంతాల్లో గాలించారు. అలాగే, తేని జిల్లా కేంద్రంలో కూడా తనిఖీలు చేశారు. దీనిపై ఓ పోలీస్‌ ఉన్నతాధికారి  స్పందిస్తూ, మావోయిస్టులతో సంబంధం ఉన్న కార్తీక్‌ మదురైలో ఉన్నట్టు సమాచారం అందడంతో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఆయన బంధువులు, మావోయిస్టు సానుభూతిపరుల నివాసాల్లో ఈ గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. 

Updated Date - 2021-11-27T13:59:56+05:30 IST