తల్లిదండ్రులు వికలాంగులు.. వారికోసం జాబ్ చేయాలనుకున్న 23ఏళ్ల కూతురు.. చివరికి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయమేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-12T16:35:43+05:30 IST

జీవితమిచ్చిన తల్లిదండ్రులు..

తల్లిదండ్రులు వికలాంగులు.. వారికోసం జాబ్ చేయాలనుకున్న 23ఏళ్ల కూతురు.. చివరికి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయమేంటో తెలిస్తే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: జీవితమిచ్చిన తల్లిదండ్రులు వికలాంగులు కావడంతో.. కుటుంబ బాధ్యత కూతురిపై పడింది. ఏదైనా పని చేసి వారిని పోషించాలనుకుంది. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు దగ్గరి బంధువు ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఆ నంబర్‌కు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి ఓ అడ్రస్ చెప్పాడు. తీరా అక్కడికి వెళ్తే ఆ అమ్మాయికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


బోఫాల్‌కు చెందిన 23ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులు వికలాంగులు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది. కుటుంబ బాధ్యత మీద పడడంతో ఆ అమ్మాయి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంది. దగ్గరి బంధువును ఓ జాబ్ చూసి పెట్టు అని అడిగింది. ‘‘అబ్రార్ అనే వ్యక్తి పేద వాళ్లకు సహాయం చేస్తుంటాడు. నీక్కూడా ఏదైనా ఉద్యోగం వెతికిపెడతాడు. ఈ నంబర్‌కు ఫోన్ చెయ్యి’’అని ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. 



సోమవారం సాయంత్రం ఆ అమ్మాయి అబ్రార్‌కు ఫోన్ చేసింది. అతను ఇస్లాం సిటీలోని తన గదికి వచ్చి కలవమన్నాడు. అక్కడికి వెళ్లిన ఆ యువతికి.. అతని గదిలో మరో ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. వాళ్లను చూసి ఆమె షాక్‌కు గురైంది. ఆ అమ్మాయి గదిలోకి రాగానే వెంటనే తలుపులు మూసేశారు. మొదటగా అబ్రార్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు వ్యక్తులు ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్ల నుంచి తప్పించుకుని ఆ అమ్మాయి నేరుగా ఇట్ఖేడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన విషయం చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు మాట్లాడుతూ అమ్మాయి తల్లిదండ్రులు వికలాంగులు కావడంతో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలనుకుంది. అబ్రార్ అనే వ్యక్తి ఉద్యోగం పేరుతో తన గదికి పిలిపించుకుని.. తన స్నేహితులు యాకుబ్, సరిక్, రెహమాన్‌లతో కలిసి నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. మంగళవారం ఉదయం 5గంటల సమయంలో ఆ అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామన్నారు.

Updated Date - 2021-10-12T16:35:43+05:30 IST