సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 5 రోజుల్లో ఇద్దరు యువతులతో వివాహం

ABN , First Publish Date - 2020-12-21T11:49:23+05:30 IST

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేవలం ఐదు రోజుల్లో ఇద్దరు యువతులతో వివాహం చేసుకొని పారిపోయిన ఉదంతం....

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 5 రోజుల్లో ఇద్దరు యువతులతో వివాహం

ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేవలం ఐదు రోజుల్లో ఇద్దరు యువతులతో వివాహం చేసుకొని పారిపోయిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. ఇండోర్ నగరంలోని ముసాఖేడి ప్రాంతానికి 26 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఇతను డిసెంబరు 2వతేదీన ఖాండ్వా ప్రాంతంలో ఓ యువతిని వివాహనం చేసుకున్నాడు.అనంతరం వివాహం చేసుకున్న ఐదు రోజులకే డిసెంబరు 7వతేదీన ఇండోర్ లోని మోవ్ లో మరో మహిళను వివాహమాడారు. ఖండ్వాలో వివాహం చేసుకున్న మహిళ కుటుంబం రెండవ వివాహం గురించి తెలుసుకొని నిందితుడి మోసంపై ఫిర్యాదు చేసింది. మోవ్ ప్రాంతంలో వివాహ విందుకు వెళ్లిన ఖండ్వా బాధితురాలి బంధువు ఒకరు నిందితుడి రెండవ వివాహం గురించి మొబైల్ ఫోనులో ఫోటోను బాధితురాలి కుటుంబానికి పంపించారు. 


దీంతో ఖండ్వాలో పెళ్లాడిన మహిళ తన భర్త రెండో పెళ్లి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహ వస్తువుల కింద ఖండ్వా మహిళ రూ.10 లఓలు ఖర్చు చేసింది. మొదటి భార్యను తన ఇంటికి తీసుకువెళ్లి భోపాల్ లో పనిఉందని చెప్పి మోవోకు వెళ్లి మరో పెళ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. రెండో పెళ్లి తర్వాత నిందితుడు డిసెంబరు 7వతేదీ తర్వాత పారిపోయాడు. అతను తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-21T11:49:23+05:30 IST