ఆవు పేడ కొనాలనే ఆలోచనలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-11-15T01:06:03+05:30 IST

ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ కోసం ఆవు

ఆవు పేడ కొనాలనే ఆలోచనలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం

భోపాల్ : ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ కోసం ఆవు పేడ కొనాలనే ఆలోచన ఉందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. రోగాలతో బాధపడే అవులకు అవి ఉన్న ప్రదేశంలోనే వైద్య చికిత్స అందజేసేందుకు ప్రత్యేకంగా ఓ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. మహిళా వెటరినేరియన్ల కోసం ఇండియన్ వెటరినరీ అసోసియేషన్ నిర్వహించిన శక్తి, 2021లో ఆయన మాట్లాడారు. 


ఆవులకు చికిత్స అవసరమైనపుడు, వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళవలసిన అవసరం లేకుండా, అవి ఉన్న చోటులోనే చికిత్స అందజేసేందుకు ఓ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించాలని తన ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా 109 హెల్ప్‌లైన్ నెంబరును అందుబాటులోకి తెస్తామన్నారు.  ఆవు పేడను కొని, దాని నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పారు. ఆవు పేడ, గోమూత్రంతో మందులు, పురుగు మందులు, ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆవుల కోసం పశువుల శాలలను అభివృద్ధి చేశామని, ఇవి విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. 


Updated Date - 2021-11-15T01:06:03+05:30 IST