మతాంతర వివాహం చేసుకున్న జంటకు అండగా నిలిచిన మధ్య ప్రదేశ్ హైకోర్టు

ABN , First Publish Date - 2022-01-30T23:00:23+05:30 IST

తల్లిదండ్రుల నిర్బంధంలో ఉన్న పందొమ్మిదేళ్ళ యువతిని ఆమె ముస్లిం

మతాంతర వివాహం చేసుకున్న జంటకు అండగా నిలిచిన మధ్య ప్రదేశ్ హైకోర్టు

భోపాల్ : తల్లిదండ్రుల నిర్బంధంలో ఉన్న పందొమ్మిదేళ్ళ యువతిని ఆమె ముస్లిం భర్తతో తిరిగి కలపాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. ఇద్దరు మేజర్ వయసుగల వ్యక్తులు ఇష్టపూర్వకంగా, నిర్బంధం లేకుండా  పెళ్లి లేదా సహజీవనం రూపంలో కలిసి జీవించాలనుకున్నపుడు మోరల్ పోలీసింగ్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆ యువతిని రక్షణ గృహానికి పంపించాలన్న ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 


స్థానిక మీడియా కథనం ప్రకారం, మధ్య ప్రదేశ్‌కు చెందిన పందొమ్మిదేళ్ళ యువతి, 22 ఏళ్ల ముస్లిం యువకుడు గుల్జార్ ఖాన్ ముంబైలో 2021 డిసెంబరు 28న పెళ్లి చేసుకున్నారు. అదే రోజు ఆమె కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని జబల్‌పూర్ సమీపంలోని గోరఖ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 21న గుల్జార్ ఖాన్ మధ్య ప్రదేశ్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వారణాసి తీసుకెళ్లి, నిర్బంధించారని ఆరోపించారు. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడుతూ, తాను మేజర్‌నని, తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుని, ఇస్లాం మతంలోకి మారానని చెప్పారు. 


Updated Date - 2022-01-30T23:00:23+05:30 IST