Indore lady fraud: ఖరీదైన కార్లు.. లగ్జరీ లైఫ్.. అందరికీ ఒకే ఒక్క అబద్ధం చెప్పి 30 లక్షలు కాజేసిన యువతి..!

ABN , First Publish Date - 2022-08-05T19:40:21+05:30 IST

ఒకే ఒక్క అబద్ధంతో ఆ యువతి తనకు తెలిసిన వారందరినీ బురిడీ కొట్టించి ఏకంగా రూ.30 లక్షలతో ఉడాయించింది.

Indore lady fraud: ఖరీదైన కార్లు.. లగ్జరీ లైఫ్.. అందరికీ ఒకే ఒక్క అబద్ధం చెప్పి 30 లక్షలు కాజేసిన యువతి..!

ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్క అబద్ధంతో ఆ యువతి తనకు తెలిసిన వారందరినీ బురిడీ కొట్టించి ఏకంగా రూ.30 లక్షలతో ఉడాయించింది. ఆమె బూసట్లకు పడిపోయిన పలువురు.. యువతి కోరిన మొత్తాన్ని(Fraud) ఇచ్చుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్(Indore) నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. 



కరోల్ బాఘ్ సొసైటీకి చెందిన స్వప్న సోనోవానే... స్థానికంగా ఉన్న వీర్ రైఫిల్ సొసైటీలో తుపాకీ వినియోగంపై కొంతకాలంగా శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకు రైఫిల్ సొసైటీకి వచ్చే పలువురితో పరిచయం ఏర్పడింది. రిటైర్డ్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు కూడా వారిలో ఒకరు. ఈ క్రమంలో ఆమె..జువెలరీ(Jewellery) మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని అందరినీ నమ్మించింది. థాయ్‌ల్యాండ్ నుంచి తక్కువ ధరకు తాను బంగారు ఆభరణాలను దిగుమతి చేసుకుంటానని చెప్పింది. తను చెప్పినట్టు పెట్టుబడులు పెడితే కళ్లు చెదిరే లాభాలు పొందొచ్చని ఊదరగొట్టింది. దీంతో.. వారందరూ ఆమె చెప్పేది నిజమనుకున్నారు. మరో ఆలోచన లేకుండా డబ్బు ఆమె చేతిలో పెట్టేశారు. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున ఆమెకు ఇచ్చారు. 


2018 నుంచి ఆమె ఈ ఒక్క అబద్ధంతో 15 మందిని మోసం చేసి రూ.30 లక్షలు కాజేసింది. ఇదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నా కూడా ఎవ్వరికీ ఒక్క పైసా లాభం కూడా చూపెట్టలేకపోయింది. డబ్బుల తిరిగివ్వమని వారు అడిగిన ప్రతిసారీ ఎదోక సాకు చెప్పి తప్పిచుకునేది. మరోవైపు.. ఈ డబ్బుతో ఆమె ఏకంగా రెండు ఫ్లాట్లు, ఖరీదైన ఓ కారను కొనుక్కుని లగ్జరీ లైఫ్ ఎంజాయి చేయసాగింది. దీంతో.. బాధితులకు తాము మోసపోయామన్న విషయం అర్థమైంది. ఈ క్రమంలో బుధవారం రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. ఇక.. తనపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న యువతి వెంటనే తన ఫ్లాటులకు తాళం వేసి పారిపోయింది. ఆమె మాటలకు మోసపోయిన వారిలో రైఫిల్ సొసైటీ కోచ్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ఆమె చేతిలో ఎంతమంది మొసపోయారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం యువతి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-05T19:40:21+05:30 IST