Municipal polls: భారీ భద్రత మధ్య Madhya pradesh లో తుది విడత పోలింగ్

ABN , First Publish Date - 2022-07-13T19:34:01+05:30 IST

మధ్యప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల తుది విడత పోలింగ్ బుధవారంనాడు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య...

Municipal polls: భారీ భద్రత మధ్య Madhya pradesh లో తుది విడత పోలింగ్

భోపాల్: మధ్యప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల (Municipal polls) తుది విడత పోలింగ్ బుధవారంనాడు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య చరుకుగా సాగుతోంది. 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 50 మున్సిపాలిటీ కౌన్సిల్స్, 169 నగర పరిషత్‌లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవ, తుది విడత పోలింగ్ కోసం 43 జిల్లాల్లో 6,829 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూలై 6న తొలి విడత పోలింగ్ జరిగింది. ఈనెల 17, 18 తేదీల్లో ఫలితాలు వెలువడతాయి.


మొదట విడత పోలింగ్‌లో 61 శాతం ఓటింగ్ నమోదు కాగా, రత్లాం, దేవాస్, అగర్ మాల్వాలో 80 శాతం, భోపాల్‌లో 51 శాతం, ఇండోర్‌లో 76 శాతం, ఉజ్జయినిలో 76.60 శాతం ఓటింగ్ నమోదైంది. భోపాల్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడంపై మధ్యప్రదేశ్ బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బూత్ స్థాయి అధికారులు వోటర్ స్లిప్‌లు చాలా నిదానంగా ఇవ్వడం వల్ల అనేక మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని ఆరోపించింది. దీనిపై బీజేపీ ఆఫీస్ బేరర్ల ప్రతినిధులు జూలై 7న ఎస్‌ఈసీ కమిషనర్ బసంత్ ప్రతాప్ సింగ్‌ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఒక మెమొరాండం సమర్పించారు.


Updated Date - 2022-07-13T19:34:01+05:30 IST