మాదిగలు ఏ త్యాగానికైనా సిద్ధపడాలి

ABN , First Publish Date - 2022-10-01T06:03:01+05:30 IST

మాదిగలు హక్కులను కాపాడుకునేందుకు ఏత్యాగాలకైనా సిద్ధపడాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షు డు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ పిలుపునిచ్చారు.

మాదిగలు ఏ త్యాగానికైనా సిద్ధపడాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

తుర్కపల్లి, సెప్టెంబరు 30: మాదిగలు హక్కులను కాపాడుకునేందుకు ఏత్యాగాలకైనా సిద్ధపడాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షు డు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవా రం నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ టీఎమ్మార్పీఎస్‌ సదస్సులో ఆయన మాట్లాడారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ ప్రకారం దేశ సహజ సంపద, భూమి, పరిశ్రమలు జనాభా దామాషా ప్రకారం దక్కాలన్నారు. సా మాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కులు మాదిగలు పొందాలన్నారు. అందుకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పాటైందని, ఇప్పటి వరకు పలు పోరాటాలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు పా ల్గొన్నారని, అయితే రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్యాయానికి గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, కార్పొరేషన్లలో ప్రాధాన్యం లేకపోవడం విచారకరమన్నారు. మాదిగల ఓటును చైత న్యం వైపు మళ్లించి హక్కులను కాపాడుకోవడం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి బూషి మహేష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్రెల రమేశ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొట్ల శ్రీనివాస్‌, భైరపాక నాగరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి క్యాసగల్ల రమేశ్‌, మండల అధ్యక్షుడు యాదగిరి, కరుణాకర్‌, మహేశ్‌, రవి, బాలమణి, రేణుక పాల్గొన్నారు.

 

Updated Date - 2022-10-01T06:03:01+05:30 IST