ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రాజ్యం

ABN , First Publish Date - 2020-08-08T08:38:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రాజ్యం ఏలుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రాజ్యం

 నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమా


కళ్యాణదుర్గం, ఆగస్టు 7 : ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రాజ్యం ఏలుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో నాయకులు దొడగట్ట నారాయణ, బిక్కి గోవిందప్ప, మాదినేని మురళి, సత్యప్ప, శివన్న, టీకేబీ ఇస్మాయిల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజధానిని వికేంద్రీకరణ చేస్తే వైసీపీకి పుట్టగతులుండవన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ పార్టీ అధోగతిపాలైన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే రాజధాని వికేంద్రీకరణ అంశంపై ప్రజాభిప్రాయం కోరాలని సవాల్‌ చేశారు.


చంద్రబాబు  అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని 48 గంటలు సమయం ప్రకటించినా వైసీపీ నేతలు స్పందించక పోవడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.   వికేంద్రీకరణ పై హైకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురయ్యిందన్నారు. ఇప్పటికైనా అన్ని ప్రాంతా ప్రజల అభిప్రాయాలను తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సుబ్బరాయుడు, నాగరాజు, రామాంజినేయులు, వెంకటేశులు, మంజు, అరవింద్‌, సురే్‌షయాదవ్‌, గోవిందరాజులు, రాయల్‌హర్షా, వన్నూర్‌స్వామి, బసవరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T08:38:04+05:30 IST