Virtual wedding: అమెరికా అబ్బాయి.. తమిళనాడు అమ్మాయి.. వర్చువల్‌ వెడ్డింగ్‌కు హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2022-08-02T16:38:27+05:30 IST

మద్రాస్ హైకోర్టు (Madras High Court) తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడు (Tamil Nadu)కు చెందిన మహిళ వర్చువల్‌ విధానంలో ఇండో-అమెరికన్‌ (Indo-American)ను పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది.

Virtual wedding: అమెరికా అబ్బాయి.. తమిళనాడు అమ్మాయి.. వర్చువల్‌ వెడ్డింగ్‌కు హైకోర్టు అనుమతి

చెన్నై: మద్రాస్ హైకోర్టు (Madras High Court) తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడు (Tamil Nadu)కు చెందిన మహిళ వర్చువల్‌ విధానంలో ఇండో-అమెరికన్‌ (Indo-American)ను పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది. వివాహం చేసుకోవడం మానవ ప్రాథమిక హక్కు అని, ప్రత్యేక వివాహం చట్టం 1954లోని సెక్షన్‌ 12, 13 ఈ హక్కును తెలియజేస్తుందని ఈ సందర్భంగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తెలియజేశారు. చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం ఏ రూపంలోనైనా పరిణయం జరుపుకోచ్చని ఆయన గుర్తు చేశారు. దీంతో పిటిషన్‌దారు వర్చువల్ విధానాన్ని(Virtual wedding) ఎంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారతీయ-అమెరికన్ అయిన రాహుల్ ఎల్ మధుతో తన వివాహాన్ని వర్చువల్ విధానం ద్వారా జరిపేందుకు కన్యాకుమారి సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలంటూ వాస్మి సుదర్శిని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలాగే తమ వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద రిజిస్టర్ చేసి వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఆమె కోరింది.


దీనిని విచారించిన జస్టిస్ స్వామినాథన్ బెంచ్.. ముగ్గురు సాక్షుల సమక్షంలో వర్చువల్ విధానంలో రాహుల్ ఎల్ మధుతో పిటిషనర్‌ పరిణయం (Marriage) నిర్వహించాల్సిందిగా సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఇక వివాహానికి ఇరుపక్షాలు తప్పనిసరిగా భారతీయ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. కాగా, పిటిషనర్‌ కమ్ పెళ్లికూతురు సుదర్శినికి రాహుల్ మధు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ ఉంది. కనుక వివాహం అనంతరం సుదర్శినిని మధు తరపున వివాహ ధృవీకరణ పత్రంలో, రిజిస్ట్రార్ ఆఫీసులోని రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు కోర్టు అనుమతించింది. అనంతరం ఆమెకు చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. కన్యాకుమారికి చెందిన సుదర్శిని, అమెరికాకు చెందిన రాహుల్ మధు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి (Marriage) చేసుకోవాలనుకున్నారు. అయితే, రాహుల్ అమెరికాలో ఉండగా.. సుదర్శిని ఇండియాలో ఉంది. రాహుల్‌కు ఇప్పుడిప్పుడే భారత్‌కు వచ్చే అవకాశం లేదు. దాంతో ఇరు కుటుంబాల వారు ఇలా కోర్టు అనుమతితో ఆన్‌లైన్ (వర్చువల్ విధానం)లో వివాహం చేయ‌డానికి రెడీ అయ్యారు. 

Updated Date - 2022-08-02T16:38:27+05:30 IST