Covid కోరల్లో ఐఐటీ

ABN , First Publish Date - 2022-04-30T12:49:14+05:30 IST

కరోనా కోరల్లో మద్రాస్‌ ఐఐటీ చిక్కుకుంది. ఐఐటీ ప్రాంగణంలో రోజురోజుకు కరోనాకేసులు విజృంభిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం మరో 11

Covid కోరల్లో ఐఐటీ

                    - 182కు చేరిన కొవిడ్‌ కేసులు


పెరంబూర్‌(చెన్నై): కరోనా కోరల్లో మద్రాస్‌ ఐఐటీ చిక్కుకుంది. ఐఐటీ ప్రాంగణంలో రోజురోజుకు కరోనాకేసులు విజృంభిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం మరో 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 182కు పెరిగింది. బాధితులను ప్రత్యేక గదిలో క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రారంభంలో పాజిటివ్‌ లక్షణాలకు గురైన 12 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, వారిని మరో 7రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా బాధితులను వెలుపలికి అనుమతించకపోగా, బయటివారు వెళ్లేందుకు నిషేధం విధించారు. ఐఐటీలో ప్రత్యక్ష తరగతులను తాత్కాలికంగా నిలిపివేయగా, హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టారు. ఇప్పటివరకు పాజిటివ్‌ లక్షణాలకు గురైన వారికి నిర్వహించిన పరీక్షల్లో వారికి ‘బీఏ2’ రకం వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని, అందువల్ల వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలియజేసింది.

Updated Date - 2022-04-30T12:49:14+05:30 IST